ఇప్పుడు బాహుబలి2 రికార్దులు ఏమైపోతాయో అనే బెంగలో ప్రభాస్, రాజమౌళి ఫాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ వచ్చినా బాహుబలి రికార్డ్స్ సేఫ్ గానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కన్నడ కెజిఎఫ్ 2 మాత్రం అన్ని రికార్డులకు చెక్ పెట్టేస్తుంది. హిందీలో అయితే కెజిఎఫ్ సునామీని తట్టుకోవడం, ఇప్పటివరకు ఉన్న రికార్దులని కాపాడుకోవడం కష్టంగా మారింది. ఆ రేంజ్ లో కెజిఎఫ్ కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. నార్త్ ఆడియన్స్ కెజిఎఫ్ చాప్టర్2 యాక్షన్ కి పడిపోయారు. అందుకే అక్కడ ఫస్ట్ డే 53.95 కోట్లు, సెకండ్ డే 46.79 కోట్లు, మూడో రోజున 42.90 కోట్లు, నాలుగో రోజున 50.35 కోట్లు తో బాక్సాఫీసు దగ్గర భీబత్సం సృష్టించింది.
అంతేకాకుండా సోమవారం 10 కోట్ల మేర అడ్వాన్సు బుకింగ్‌తో హిందీలో అతివేగంగా 200 కోట్లు సాధించిన చిత్రంగా కేజీఎఫ్2 చరిత్ర సృష్టించింది. అంటే బాహుబలి 2 అక్కడ హిందీలో ఆరు రోజుల్లో 200 కోట్ల క్లబ్బులోకి చేరితే కెజిఎఫ్ ఐదు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్బులోకి ప్రవేశించింది. దానితో 200 కోట్ల క్లబ్‌లో వేగంగా చేరిన సినిమాగా కెజిఎఫ్ చాప్టర్ 2 చరిత్ర సృష్టించింది. అలా బాహుబలి 2 నినార్త్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 తొక్కేసి.. రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.