మెగాస్టార్ చిరంజీవి - రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 23న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. చిత్ర యూనిట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో చాలా బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఆచార్య సినిమా పోస్టర్స్ .. టీజర్.. ట్రైలర్.. రెండు పాటలకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సోమవారం రోజున చిత్ర యూనిట్ భలే భలే బంజారా.. అనే పాటను విడుదల చేశారు. పాటకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది.
సింబా రింబ సింబా రింబ సిరత పులుల సిందాట
సింబా రింబ సింబా రింబ సరదా పులుల సయ్యాట
సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చిందీ
నిప్పు కాక రేగింది.. డప్పు మోత మోగింది
కాకులు దూరని కారడవిలో పండగ పుట్టింది
గాలి గంతులాడింది.. నేల వంత పాడింది
సీకటంతా సిల్లుపడి ఎన్నెలయ్యిందియాలా
అందినంత దండుకుందా పద తలో చేయ్యలా
భలే భలే బంజారా మజా మందేరా రేయి కచేరీలో రెచ్చిపోదాం రా
భలే భలే బంజారా మజా మందేరా రేయి కచేరీలో రెచ్చిపోదాం రా
అని ఆచార్య, సిద్ధ హుషారుగా చిందేస్తున్నారు. అసలు వారికి అడవిలో ఏం పని.. వారిని చూసి ఆడవి బిడ్డలు ఎందుకు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. అనే విషయాలు తెలియాలంటే ఆచార్య సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.