కన్నడలో తెరకెక్కి పాన్ ఇండియా మార్కెట్ లో అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొడుతున్న కెజిఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదలైన అన్ని భాషల్లో విజయ ఢంకా మోగిస్తుంది. రాఖి భాయ్ గా యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ కి బిసి సెంటర్స్ ఆడియన్స్ కెజిఎఫ్ చాప్టర్ 2 కి బ్రహ్మరథం పడుతున్నారు. కెజిఎఫ్ 2 పై ఎన్ని అంచనాలైతే పెట్టుకున్నారో.. ఆ అంచనాలను ఈజీగా రీచ్ అయ్యేలా కనబడుతుంది ఈ సినిమా. హిందీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలువడమే కాకుండా ఆల్‌టైమ్ ఓపెనింగ్స్ సాధించింది.
కేవలం నాలుగు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్బులోకి చేరిపోయింది. కన్నడ లో నాలుగు రోజుల్లోనే 500 కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా కెజిఎఫ్ 2 రికార్డ్ సృష్టించింది. అలాగే యశ్ - ప్రశాంత్ నీల్ హిందీలో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నారు. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కెజిఎఫ్ చాప్టర్ 2 కి బాగా కలిసొచ్చింది. అలాగే కెజిఎఫ్ చాప్టర్ 2 అసలు కథ సోమవారం వర్కింగ్ డే కి మొదలవుతుంది అన్నప్పటికీ.. సోమవారం కూడా థియేటర్స్ ఆక్యుపెన్సీ ఫుల్ గానే ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐదో రోజున కెజిఎఫ్ చాప్టర్ 2 సత్తా చాటి 600 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయినా అవ్వొచ్చని అంటుంటే.. ఇప్పుడు కెజిఎఫ్ మేకర్స్ 546 కోట్ల కలెక్షన్స్ పోస్టర్ ని షేర్ చెయ్యడంతో యశ్ ఫాన్స్, మాస్ ఫాన్స్ అధికారిక పోస్టర్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.