పుష్ప ద రైజ్ లో అల్లు అర్జున్ పుష్ప లుక్ లో చాలా అంటే చాలా డిఫరెంట్ గా కనిపించారు. సుకుమార్ అల్లు అర్జున్ ని మాస్ ఆడియన్స్ కి మెచ్చేలా డిజైన్ చేసారు. చాలా అంటే చాలా రఫ్ గా ఓ ఎర్రచందనం కూలీలా చూపించారు. అలాగే లాంగ్ హెయిర్ తో.. మరీ పాతకాలం మనిషిలా అల్లు అర్జున్ లుక్ ఉంది. అదే లుక్ ని అల్లు అర్జున్ సినిమా మొత్తం మెయింటింగ్ చేసారు. ఒక స్టేజ్ కి చేరాక చేతికి వచ్చి, మేడలో బంగారు గొలుసు ఇలా కొద్దిగా లుక్ చేంజ్ చేసారు. ఇక పుష్ప ద రూల్ లోను అల్లు అర్జున్ అదే లుక్ ని మెయింటింగ్ చేస్తారని అందరూ ఫిక్స్ అవుతున్నారు. ఎందుకంటే దీనికి సీక్వెల్ గా వస్తుంది కాబట్టి.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పూష ద రూల్ లో రఫ్ లుక్ లోనే సరికొత్తగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. రఫ్ లుక్ తో పాటు కొద్దిగా స్టైలిష్ లుక్ లో కూడా అల్లు అర్జున్ ఈ సినిమాలో కనిపిస్తారని అంటున్నారు. పుష్ప లో అల్లు అర్జున్ హీరో నా అంటే కాదు, విలన్ అంటే కాదు, హీరోయిజం అడుగడుగునా కనిపిస్తుంది. సో ఈసారి పుష్ప ద రూల్ లో అల్లు అర్జున్ కొత్త వేరియేషన్ చూయించడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఇక రష్మిక శ్రీవల్లి లుక్ లోను కొద్దిగా మార్పులు చేర్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక పార్ట్ 2 లో బాలీవుడ్ నుండి కొంతమంది నటులు యాడ్ అవుతున్నట్లుగా టాక్.