Advertisementt

సర్కారు వారి పాట సాంగ్ షూట్ స్టార్ట్

Mon 18th Apr 2022 11:05 AM
sarkaru vaari paata,mahesh babu,parasuram,sarkaru vaari paata final song shoot  సర్కారు వారి పాట సాంగ్ షూట్ స్టార్ట్
Sarkaru Vaari Paata Final song shoot kickstarts సర్కారు వారి పాట సాంగ్ షూట్ స్టార్ట్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - కీర్తి సురేష్ కలయికలో పరశురామ్ తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ మే 12 టార్గెట్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన.. రెండు పాటలు ట్రేండింగ్ లో ఉన్నాయి. అయితే మూడో పాట అప్ డేట్ కానీ, టీజర్ అప్ డేట్ కానీ ఇవ్వకుండా మేకర్స్ నాన్చుతూ ఉండడంతో  మహేష్ ఫాన్స్ కి తిక్కరేగింది. దానితో WorstTeamSVP అనే హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో గందర గోళం సృష్టిస్తున్నారు. మూడో పాట అప్ డేట్ ఇస్తే నిన్ను అందనంత ఎత్తులో కూర్చోబెడతాం, మేకర్స్ కి అస్సలు కరుకు లేదు, సర్కారు వారి అప్ డేట్ కావాలంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఈ దెబ్బకి మేకర్స్ సర్కారు వారి పాటు నుండి ఓ చిన్న అప్ డేట్ వదిలారు.

అదేమిటంటే సినిమా షూటింగ్ ఈమధ్యనే పూర్తయ్యి ఓ సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా చెప్పిన కొన్ని రోజులకే.. ఇప్పుడు ఆ చివరి సాంగ్ షూట్ ని మొదలు పెట్టినట్లుగా మేకర్స్ అప్ డేట్ వదిలారు. ఆ సాంగ్ షూట్ నుండి కొన్ని పిక్స్ వదులుటమంటూ క్రేజీ అప్ డేట్ ఇవ్వడంతో మహేష్ ఫాన్స్ శాంతించారు. లేదంటే నిన్న ఆదివారం ఉదయం నుండి WorstTeamSVP హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ మేకర్స్ పై విరుచుకుపడుతున్నారు.

Sarkaru Vaari Paata Final song shoot kickstarts:

Sarkaru Vaari Paata update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ