Advertisementt

బిగ్ బాస్: మహేష్ విట్టా సెన్సేషనల్ కామెంట్స్

Mon 18th Apr 2022 10:30 AM
mahesh vitta,bigg boss non stop,bigg boss,bigg boss ott  బిగ్ బాస్: మహేష్ విట్టా సెన్సేషనల్ కామెంట్స్
Bigg Boss Non Stop: Mahesh Vitta Sensational comments బిగ్ బాస్: మహేష్ విట్టా సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్స్ గా వచ్చి మధ్యలోనే ఎలిమినేట్ అయిన మహేష్ విట్టా.. నాన్ స్టాప్ లోకి అడుగుపెట్టాడు. టైటిల్ ఫెవరెట్ గా లేకపోయినా కనీసం టాప్ 5 కి వెళ్లే కంటెస్టెంట్ లాగే కనిపించినా.. ఈ వారం ఆశు రెడ్డి కెప్టెన్సీ పవర్ వలన నామినేషన్స్ లోకి వెళ్లి అనూహ్యంగా ఎలిమినేట్ అవడం మహేష్ విట్టా నే కాదు.. చాలామందిని బాధించింది. ఎందుకంటే మహేష్ విట్టా కన్నా వీక్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు కాబట్టి. అదే విషయం ఇప్పడు మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. ఇక బిగ్ బాస్ స్టేజ్ పైనే నాగ్ అడిగిన ప్రశ్నలకు మహేష్ కరెక్ట్ గా సమాధానం చెప్పాడు.

హౌస్ లో పుష్ప లు ఎవరు, ఫైర్ బ్రాండ్ ఎవరు అని.. దానికి మహేష్ అఖిల్, శివ, బిందు, అరియానాలు ఫైర్ అని.. అనిల్, అజయ్, నటరాజ్ మాస్టర్, మిత్రా, అషూ రెడ్డి, హమీదలు పుష్పాలు అని చెప్పాడు మహేష్. అయితే బయటికొచ్చాక ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ కాస్త అసహనంగాను, సెన్సేషనల్ గాను మాట్లాడాడు. బిగ్ బాస్ ఎలిమినేషన్స్ పై మహేష్ సంచనల కామెంట్స్ చేసాడు. నాకన్నా ముందే అనిల్, మిత్రా సేఫ్ అవగానే ఈ వారం నేనే ఎలిమినేట్ అవుతానని అనుకున్నా. అందుకే నేనేమీ టెన్షన్ పడలేదు అన్నాడు. 

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఈ ట్విస్టులు కొత్తేం కాదు కదా.. గతంలో జరిగిన చైతూ, తేజూ ఎలిమినేషన్ అప్పుడు యాక్టివ్‌గా ఉండే వాళ్లను పంపారు. సైలెంట్‌గా ఉండే వాళ్లను ఉంచారు అనుకున్నా. కానీ ఈవారం ఇప్పుడు కూడా అదే చేశారు. వాళ్లకు నచ్చిన వాళ్లను ఉంచుతున్నారు. బిగ్ బాస్ ముందు నుండే ఇలాంటి నామినేషన్స్ ఉంటాయని మాకు హింట్ ఇచ్చారు.. అంటూ మహేష్ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

Bigg Boss Non Stop: Mahesh Vitta Sensational comments:

Mahesh Vitta comments on Bigg Boss Non Stop

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ