Advertisementt

NTR30 పై అప్ డేట్ ఇచ్చిన కొరటాల

Mon 18th Apr 2022 09:29 AM
ntr 30,young tiger ntr,ntr 30 update,koratala shiva,acharya interview  NTR30 పై అప్ డేట్ ఇచ్చిన కొరటాల
NTR 30 update on Koratala Shiva NTR30 పై అప్ డేట్ ఇచ్చిన కొరటాల
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ మూవీ సక్సెస్ తర్వాత హనుమాన్ దీక్ష తీసుకున్నారు. ఆ దీక్ష 21 రోజుల పాటు ఉండొచ్చని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ తదుపరి మూవీ కొరటాల దర్శకత్వంలో జూన్ నుండి సెట్స్ మీదకెళ్లనుందని ఎన్టీఆర్ ఓ బాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తాజాగా కొరటాల శివ ఆచార్య రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో NTR30 పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ NTR30 ని సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తూ సందడి చేస్తున్నారు. 

NTR30 పై దర్శకుడు కొరటాల ఇచ్చిన అప్ డేట్ ఏమిటంటే.. ఎన్టీఆర్ తో తాను చెయ్యబోయే సినిమా జూన్ నుండి మొదలై రెగ్యులర్ షూట్ కి వెళతామని, ఎన్టీఆర్ కోసం బలమైన కథే రాసాను. అందరూ చూడాలని, ఎక్కువమంది చూడాలనే కథ రాస్తాం తప్ప తెలుగు ఆడియన్స్ కోసం ఓ కథ, పాన్ ఇండియా ఆడియన్స్ కోసం ఓ కథ అనేం ఉండదు. 

బలమైన, మంచి కథ రాస్తే అందరూ ఇష్టపడతారు.. అయినా ఇప్పుడే ఆ సినిమాపై ఇంకేం చెప్పలేను. ఆ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంటూ కొరటాల శివ NTR30 పై అదిరిపోయే అప్ డేట్ అయితే ఇచ్చేసారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ క్యూటీ అలియా భట్ ఎంపికైంది కూడా.. కాకపోతే ఇప్పడు NTR30 ప్రాజెక్ట్ నుండి అలియా భట్ తప్పుకుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. ఫైనల్ గా ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరో సినిమా ఓపెనింగ్ టైం కి తెలిసిపోతుంది. 

NTR 30 update on Koratala Shiva:

NTR 30 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ