బిగ్ బాస్ నాన్ స్టాప్ మొత్తానికి ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఏడు వారాల్లో ఊహించని కంటెస్టెంట్స్ చాలామంది ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇక గత వారం కెప్టెన్సీ టాస్క్ లో ఆశు రెడ్డి సంచాలక్ గా ఫెయిల్ అవడంతో యాంకర్ శివ తొండాట ఆడి కెప్టెన్ అయ్యాడు. బిందు మాధవి, అఖిల్ జీరోలుగా మిగలగా ఆశు రెడ్డి వరెస్ట్ పెరఫార్మెర్ గా జైలు కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ వారం ఆశు రెడ్డి కెప్టెన్ గా తన పవర్ ఉపయోగించి చేసిన తప్పిదం కారణంగా మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. మహేష్ ఎలిమినేట్ అవడమే బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.
అయితే గత కొన్ని వారాలుగా ఎలాంటి టాలెంట్ లేని మిత్ర శర్మ హౌస్ లో ఇంకా కొనసాగడంపై ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మత్రమే కాదు నాన్ స్టాప్ బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ కూడా సర్ ప్రైజ్ అవుతున్నారు. టాస్క్ ల్లో ఆడదు, ప్రతి నామినేషన్స్ లో టాప్ ఓటింగ్స్ తో ఉంటుంది. ఇక జాలి అనే పదం వర్కౌట్ అవడమే మిత్ర శర్మకి కలిసొచ్చింది. లేదంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి మిత్ర శర్మ ఎందుకు ఉంటుంది. నిజంగా మిత్ర లక్కీనే అని చెప్పవచ్చు.. గేమ్ ఆడకపోయినా.. ఆమె ఎవరితో గొడవలు పడకుండా ఉంటుంది కాబట్టే ఆమెకి ఓట్స్ పడుతున్నాయేమో అనే డౌట్ ని చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.