నాగ చైతన్య సమంత తో డివోర్స్ తీసుకున్నాక సింగిల్ గానే ఉంటున్నాడు. తన సినిమాల షూటింగ్స్ తో వెబ్ సీరీస్ తో పాటుగా తెలుగు, తమిళంలో ఓ మూవీ ని ఈ మధ్యనే ప్రకటించాడు. అయితే సమంత తో విడాకులు తీసుకున్న నాగ చైతన్య మరో పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో మొదలయ్యింది. అది కూడా తమన్నాని పెళ్లి చేసుకుంటాడని, కాదు.. నాగార్జున వేరే అమ్మాయితో నాగ చైతన్య పెళ్లి చెయ్యబోతున్నాడంటూ ఏవేవో న్యూస్ లు గత రెండు రోజులుగా బాగా హైలెట్ అవుతున్నాయి.
అయితే తాజాగా అక్కినేని కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ఏమిటి అంటే నాగ చైతన్య రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు అని, చైతూ రెండో పెళ్లి చేసుకోవడం లేదని, నాగార్జున ఏ అమ్మాయిని చైతూ కోసం తీసుకురాలేదని చెబుతున్నారు. మరి చైతు తన పని తానూ చేసుకుంటూ పోతున్నా ఇలాంటి వార్తలేందుకు పుడుతున్నాయో కానీ.. అటు సమంత మాత్రం తన వర్క్ లో బాగా బిజీ అయ్యింది. ఒకపక్క వరౌట్స్ వీడియోస్ మరోపక్క సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది.