ఇప్పుడు టైటిల్ లో మీరు చూసిన బీస్ట్ డిజాస్టర్ హాష్ టాగ్, వరెస్ట్ టీం SVP అంటే సర్కారు వారి పాట టీం హాష్ టాగ్ లు అటు మహేష్ ఫాన్స్ ఇటు విజయ్ యాంటీ ఫాన్స్ ఇద్దరూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ బీస్ట్ మూవీ విడుదలైన మొదటి షో కే డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినా.. కలెక్షన్స్ పరంగా విజయ్ క్రేజ్, ఇమేజ్ అక్కడ చూపిస్తుంది. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బీస్ట్ డిజాస్టర్ కాదు వరెస్ట్ మూవీ, చెత్త సినిమా అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. విడుదలైన రోజే డిసాస్టర్ బీస్ట్ హాష్ టాగ్ ని ట్రెండ్ చేసారు. విజయ్ ఫాన్స్ కి కూడా బీస్ట్ నచ్చలేదంటే ఆ సినిమా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక మే 12 న రిలీజ్ కాబోతున్న సర్కారు వారి పాట అప్ డేట్ పై మహేష్ ఫాన్స్ వేచి చూస్తున్నారు. అసలే మే 12 నుండి సర్కారు వారి పాట తప్పుకోవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో నడుస్తున్నా టీం స్పందించడం లేదు. మరోపక్క రెండు సాంగ్స్ వదిలి సైలెంట్ అయ్యారు. మూడో పాట వదలాలి, అలాగే సర్కారు వారి పాట ట్రైలర్ అప్ డేట్ కూడా వస్తే బావుంటుంది అని ఫాన్స్ కోరుకుంటున్నా సర్కారు వారి పాట మేకర్స్ కామ్గా ఉంటున్నారు తప్ప అప్ డేట్ ఇవ్వకపోయేసరికి మహేష్ ఫాన్స్ కి తిక్కరేగింది. దానితో #WorestTeamSVP హాష్ టాగ్ ని ట్రేండింగ్ లోకి తెచ్చారు.