Advertisementt

బిగ్ బాస్: మరో వైల్డ్ కార్డు ఎంట్రీ

Sun 17th Apr 2022 10:56 AM
baba bhaskar,bigg boss non stop telugu,bigg boss,bigg boss ott,mahesh vitta  బిగ్ బాస్: మరో వైల్డ్ కార్డు ఎంట్రీ
Bigg Boss Nonstop: Baba Bhaskar Wild Card Entry బిగ్ బాస్: మరో వైల్డ్ కార్డు ఎంట్రీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలై ఏడు వారాలు పూర్తయ్యి ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా.. ఏడో వారానికి గాను మహేష్ విట్టా ఎలిమినేట్ అయినట్లుగా బిగ్ బాస్ లీకుల సారాంశం. అయితే బిగ్ బాస్ నాలుగో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ మొదటి వారమే ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయినా ముమైత్ ఖాన్ మరో వారమే హౌస్ లో ఉండగలిగింది. మళ్ళీ వచ్చిన వారానికే ఇంటి దారి పట్టింది. అయితే హౌస్ లోకి ఇప్పుడు మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ విట్టా ఈ వారమే ఎలిమినేట్ అయ్యి వెళ్లగా.. వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

బిగ్ బాస్ మూడో సీజన్‌లో తనదైన కామెడీతో బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్న బాబా భాస్కర్ టైటిల్ కొట్టేద్దామనుకున్నా.. టాప్ 5 తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టాప్ త్రీ వరకు వెళ్లి వెనుదిరిగిన బాబా భాస్కర్ ఇప్పుడు నాన్ స్టాప్ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం బాబా భాస్కర్ ఇస్మార్ట్ జోడీ షోలో తన భార్యతో కలిసి పాల్గొంటున్నారు. ఆ షోకు సంబంధించిన షూట్ మొత్తాన్ని ఆయన కంప్లీట్ చేశారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో కోసమే బాబా భాస్కర్ ఇస్మార్ట్ జోడి షూటింగ్ పూర్తి చేసారని.. ఈ వారంలోనే కాదు ఈ రెండు రోజుల్లోనే బాబా భాస్కర్ హౌస్ లోకి  ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. 

Bigg Boss Nonstop: Baba Bhaskar Wild Card Entry :

Baba Bhaskar Wild Card Entry To Bigg Boss Non Stop Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ