Advertisementt

విరాట పర్వానికి మరో లాక్ డౌన్ కావాలేమో

Sun 17th Apr 2022 10:00 AM
virata parvam,rana,sai pallvi,venu udugula,priyamani,virata parvam release date  విరాట పర్వానికి మరో లాక్ డౌన్ కావాలేమో
Need another lockdown for Virata Parvam విరాట పర్వానికి మరో లాక్ డౌన్ కావాలేమో
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ కరోనా లాక్ డౌన్ లో వాయిదా పడిన విరాట పర్వం రిలీజ్ అవడానికి డేట్ ఇవ్వకుండా మేకర్స్ ఇంకా నాన్చుతూనే ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ డేట్ ఇచ్చాక సెకండ్ వేవ్ ఉధృతి మొదలు కావడంతో ఆ సినిమాని వాయిదా వేశారు. విరాట పర్వంతో పాటు వాయిదా పడిన లవ్ స్టోరీ.. ఇంకొన్ని సినిమాలు విడుదలైపోయాయి కూడా. కానీ రానా సినిమాకే మోక్షం కలగడం లేదు. సురేష్ బాబు విరాట పర్వాన్ని ఓటిటిలో రిలీజ్ చేయాలో లేదంటే థియేటర్స్ లో విడుదల చెయ్యాలో తెలియక సతమతమవుతున్నట్టుగా కనబడుతుంది ప్రస్తుతం విరాట పర్వం పరిస్థితి. రానా విరాట పర్వం షూటింగ్ కంప్లీట్ అయ్యాక చేసిన సినిమాలన్నీ విడుదల కూడా అయ్యాయి. అందులో భీమ్లా నాయక్ అదిరిపోయే సక్సెస్ అయ్యింది కూడా. 

ఈమధ్యన విరాట పర్వం మూవీ కి మళ్ళీ రిపేర్లు చేశారనే న్యూస్ వినబడింది. అలాగే విరాట పర్వం మూవీ కి భారీ ఓటిటి ఆఫర్ కూడా వచ్చింది.. ఇక సురేష్ బాబు విరాట పర్వాన్ని ఓటిటికి అమ్మేస్తున్నారనే ఊహాగానాలు నడిచాయి. మరి అటు సాయి పల్లవి, ఇటు ప్రియమణి, రానా ఎవరి పనుల్లో వారు బిజీ అవ్వగా.. విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల మాత్రం విరాట పర్వం రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సినిమా సక్సెస్ అయితేనే కదా ఆయనకి మరో హీరో ఆఫర్ ఇచ్చేది. మరి విరాట పర్వం రిలీజ్ చెయ్యాలంటే మరో లాక్ డౌన్ కావాలేమో మేకర్స్ కి.. అందుకే వెయిట్ చేస్తున్నారు. ఆఖరికి విరాట పర్వం ఓటిటి లోనే రిలీజ్ ఉంటుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Need another lockdown for Virata Parvam:

The wait continues for the OTT release date of Virata Parvam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ