బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు ఆరుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ ని వీడారు. ముందుగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యి ఐదో వారంలో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చినా అదే వారంలో మరోసారి ఎలిమినేట్ అయ్యింది. తర్వాత శ్రీ రాపాక, సరయు, ఆర్జే చైతు, తేజస్వి, స్రవంతి చొక్కారావు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారిలో బిందు మాధవి ఓటింగ్ పరంగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా.. తర్వాత అఖిల్, తర్వాత స్థానాల్లో యాంకర్ శివ ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈవారం డేంజర్ జోన్ లో నటరాజ్ మాస్టర్, మిత్ర శర్మ, మహేష్ విట్టాలు ఉన్నట్లుగా ఓటింగ్ పోల్స్ చెబుతున్నాయి. మహేష్ విట్టా అసలైతే నామినేషన్స్ లో లేడు. కానీ ఆశు రెడ్డి కెప్టెన్సీ పవర్ తో మహేష్ ని బలి చేసింది. మహేష్, నటరాజ్, మిత్రా లలో మిత్ర, నటరాజ్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అన్నా.. చివరికి మహేష్ ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా లీకులు చెబుతున్నాయి. సోషల్ మీడియా ఓటింగ్స్ ప్రకారం నటరాజ్ వెళ్లాల్సి ఉండగా.. అనూహ్యంగా ఈ వారం మహేష్ ఎలిమినేట్ అయ్యాడు. కేవలం ఆశు రెడ్డి చేసిన తప్పిదం వలన మహేష్ విట్టా ఎలిమినేషన్ కత్తికి బలైపోయాడు అంటూ లీకులు బయటికి వచ్చాయి. చూద్దాం రేపు నాగ్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారో అనేది.