రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ లో ట్రిపుల్ ఆర్ తో అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ట్రిపుల్ ఆర్ కి రికార్డ్ కలెక్షన్స్ రావడం కలెక్షన్స్ పరంగా ట్రిపుల్ ఆర్ మూడో స్థానంలో నిలవడం అందరిని ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే రాజమౌళి స్టామినా అందరికి తెలుసు కాబట్టి. అయితే సినిమా ఎంతగా హిట్ అయినా.. ట్రిపుల్ ఆర్ ని గమనిస్తే అందులో కథ అనేది లేదు. కేవలం హీరో ల యాక్షన్ సీక్వెన్స్ తోనే సినిమాని నిలబెట్టారు రాజమౌళి. ఎన్టీఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్, అలాగే కొమరం భీముడా సాంగ్ తో హైలెట్ చెయ్యగా, రామ్ చరణ్ ని సెకండ్ హాఫ్ లో అల్లూరి గా హైలెట్ చేసారు. అలా కథ కి ఇంపార్టెన్స్ లేకుండానే చరణ్, ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ తోనే సినిమాని 1000 కోట్లు కలెక్షన్స్ దాటించేసారు రాజమౌళి.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రశాంత్ నీల్ -యాష్ ల కెజిఎఫ్ చాప్టర్ లో కూడా కథ మైనస్. కథ లేకపోయినా.. కేవలం యాక్షన్ సీన్స్ తోనే కెజిఎఫ్ చాప్టర్2 హిట్ కొట్టింది. యాష్ ఎలివేషన్ సీన్స్ కి ప్రశాంత్ నీల్ ప్రాధాన్యత ఇచ్చారు. నార్త్ ప్రేక్షకులకి కథతో పనిలేదు.. యాక్షన్ సీన్స్ హైలెట్ అయ్యాయా.. అవి హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయా అనేది ఉంటే చాలు సినిమాని హిట్ చేసి పారేస్తారు. గతంలో సాహో మూవీ అంతే. ఇప్పుడు కెజిఎఫ్ చాప్టర్ 2. బాలీవుడ్ ప్రేక్షకులకి కథ అక్కర్లేదు, ఫైటింగ్ సీన్స్ కే పడిపోతారు. అలాంటిది.. ఇప్పుడు అన్ని భాషా ప్రేక్షకులు యాక్షన్ కే అగ్ర తాంబూలం ఇవ్వడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రెండు పాన్ ఇండియా సినిమాల్లో కథ బలంగా లేదు.. కేవలం యాక్షన్ తప్ప.