Advertisementt

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేషన్ పై డౌట్

Fri 15th Apr 2022 09:05 PM
bigg boss,bigg boss non stop,mahesh vitta,nataraj master,mitraaw sharma,ashu reddy,anil,ajay,anchor shiva,akhil,bindhu madhavi  బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేషన్ పై డౌట్
Bigg Boss non Stop: Doubt over elimination this week బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేషన్ పై డౌట్
Advertisement
Ads by CJ

ఈ వారం నామినేషన్స్ లో అఖిల్, బిందు, శివ, నటరాజ్, అరియనా, మిత్రా శర్మ తో పాటుగా ఆశు రెడ్డి కెప్టెన్సీ పవర్ తో మహేష్ విట్టా కూడా నామినేషన్స్ లోకి వెళ్ళాడు. గత వారం స్రవంతి - ముమైత్ ఖాన్ ఇద్దరూ డబుల్ ఎలిమినేషన్స్ లో బయటికి వెళ్లగా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో సస్పెన్స్ మొదలయ్యింది. ఎప్పటిలాగే అఖిల్ - బిందు మధ్యలో ఓటింగ్ విషయంలో టఫ్ ఫైట్ నడుస్తుండగా.. యాంకర్ శివ ఓటింగ్ లో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ వారం శివ కెప్టెన్ కూడా అయ్యాడు. ఇక అరియనా కూడా సేఫ్ గానే ఉన్నప్పటికీ.. నటరాజ్, మిత్రా శర్మ, మహేష్ లు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని ఓ ఊహాగానం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లేదు అంటే మిత్రా శర్మ కానీ, నటరాజ్ మాస్టర్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అయితే ఈ వారం ఫ్యామిలీ మెంబెర్స్ ని పిలిపిస్తారని, అలా నటరాజ్ మాస్టర్ తన పాపతో ఎలిమినేషన్ నుండి బయటపడొచ్చని అంటుంటే.. మిత్ర శర్మ కూడా చిన్నప్పుడే తల్లి చనిపోయింది. మిత్ర తండ్రి కూడా చనిపోవడంతో ఆమె ని జాలితో తప్పించొచ్చు అంటున్నారు. మహేష్ విట్టా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వారం ఎలిమిషన్ ప్రక్రియ ఉండకపోవచ్చని అంటున్నారు.. చూద్దాం ఈ శనివారం రాత్రికి ఎలిమిషన్ ఉందా లేదా అనేది తేలిపోతుంది. 

Bigg Boss non Stop: Doubt over elimination this week:

Bigg Boss: 2 contestants in Danger zone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ