ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో మసకబారుతుంది. సరైన జెడ్జ్ లేరు, దానికి తోడు కమెడియన్స్ తగ్గిపోతున్నారు. ఏదో స్పెషల్ స్కిట్స్ అంటూ సీరియల్ స్టార్స్, ఢీ డాన్స్ మాస్టర్స్ తో స్కిట్స్ చేస్తూ ఓ గంట సమయాన్ని గడిపేస్తున్నారు. జబర్దస్త్ స్కిట్స్ లో ఆయమన్న కామెడీ పండించేవారే లేరు. హైపర్ ఆది గురువారం, సుడిగాలి సుధీర్ శుక్రవారం జబర్దస్త్ కి అండగా ఉంటారనుకుంటే.. ఇప్పుడు హైపర్ ఆది జబర్దస్త్ లో కనిపించడం లేదు. మూడు వారాలైంది ఆది స్కిట్ చేసి. పోనీ మరేదన్నా కారణాలతో జబర్దస్త్ కి దూరమయ్యాడా అంటే అదీ లేదు.
ఎందుకంటే మరికొన్ని షోస్ అయిన ఢీ డాన్స్ షో కి వస్తున్నాడు. అక్కడ కామెడీ చేస్తున్నాడు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆది వెళ్తున్నాడు. కానీ జబర్దస్త్ లోనే కనిపించడం లేదు. మరోపక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజా జబర్దస్త్ కి వీడ్కోలు చెప్పేసింది. ఆమె జబర్దస్త్ కి బై బై చెప్పిన ప్రోమో కూడా వైరల్ అయ్యింది. మరి రోజా కన్నా ముందే ఆది జబర్దస్త్ నుండి తప్పుకున్నాడా? లేదంటే మరేదన్నానా.. అసలు ఆది ఇకపై జబర్దస్త్ లో కనిపిస్తాడా? అనేది ఇప్పుడు ఆది ఫాన్స్ లో కలుగుతున్న అనుమానాలు. మరి ఒక వారమో రెండు వారాలో గ్యాప్ కాదు.. ఏకంగా మూడు వారాలుగా హైపర్ ఆది రావడం లేదు. అందుకే ఈ అనుమానాలు.