Advertisementt

RRR, కెజిఎఫ్ 2 పై ప్రభాస్ కామెంట్స్

Fri 15th Apr 2022 06:33 PM
prabhas,kgf 2,rrr movie,radhe shyam,baahubali,ntr,ram charan,prashanth neel,rajamouli  RRR, కెజిఎఫ్ 2 పై ప్రభాస్ కామెంట్స్
Prabhas comments on RRR, KGF2 success RRR, కెజిఎఫ్ 2 పై ప్రభాస్ కామెంట్స్
Advertisement
Ads by CJ

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ని మెయింటింగ్ చేస్తున్న ప్రభాస్.. సాహో, రాధే శ్యామ్ మూవీస్ తో కాస్త వెనుకబడ్డారు. బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్  ని ఓకె చేసిన ప్రభాస్ ఇప్పుడు ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, సలార్, స్పిరిట్ మూవీస్ తో పాటుగా మారుతి మూవీకి ఓకె చెప్పారు. రాధే శ్యామ్ తర్వాత స్పెయిన్ వెళ్లిన ప్రభాస్ కొన్ని రోజుల విశ్రాంతితో మళ్ళీ షూటింగ్స్ కి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్ లో చిత్రీకరణ జరుగుతుండగా.. సలార్ టీజర్ ని వచ్చే నెలాఖరుకి సిద్ధం చేస్తున్నట్లుగా ఆ దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పారు. 

అయితే మార్చ్ 25 న పాన్ ఇండియా మార్కెట్ లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ట్రిపుల్ ఆర్, నిన్న పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న కెజిఎఫ్ పైన, రామ్ చరణ్, ఎన్టీఆర్ తనకి పోటీనా అనే ప్రశ్నకి ప్రభాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరణ్, ఎన్టీఆర్, యశ్ లు పాన్ ఇండియా మూవీ హిట్స్ వారితో పోటీ పెరిగింది అని భవిస్తున్నారా అని ప్రభాస్ ని అడగగా.. మనం చాలా సినిమాలు తెరకెక్కించాలి, క్రాస్ ఇండియా మూవీస్ పై దృష్టి పెట్టాలి. పాన్ ఇండియా మూవీస్ హిట్ అయ్యాయి, ఆ హీరోలతో నాకు పోటీ అని నేను భావించను. ఎందుకంటే సౌత్, నార్త్ హీరోలతో కలిసి మరిన్ని పాన్ ఇండియా మూవీస్ చెయ్యాలి. 

ఇక రాజమౌళి ట్రిపుల్ ఆర్ చూసా, సినిమా చాలా నచ్చింది. ఆ సినిమా విడుదలైన అన్ని చోట్ల సక్సెస్ అవడం హ్యాపీ గా ఉంది. రాజమౌళి ఇప్పుడు సౌత్ డైరెక్టర్ కాదు, ఇండియన్ డైరెక్టర్. ఇక కెజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ టాక్ రావడం, ఆ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో వర్క్ చెయ్యడం హ్యాపీ గా ఉంది అంటూ ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Prabhas comments on RRR, KGF2 success:

Prabhas comments on Pan india heroes 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ