Advertisementt

బన్నీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్స్ కాదా?

Fri 15th Apr 2022 02:23 PM
raveena tandon,pan india stars,yash,ram charan,prabhas,ntr,allu arjun  బన్నీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్స్ కాదా?
Raveena Tandon Shocking comments about Pan India Stars బన్నీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్స్ కాదా?
Advertisement
Ads by CJ

బాహుబలి తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మాత్రమే చేస్తున్నారు. ఇక కెజిఎఫ్ తో యశ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. తర్వాత బన్నీ పుష్ప మూవీ పాన్ ఇండియా మార్కెట్ లో సంచలనాలు నమోదు చేసారు. తర్వాత రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకేసారి ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టారు. హిందీలోనూ, మిగతా అన్ని భాషల్లో ట్రిపుల్ ఆర్ ప్రభంజనం గురించి రెండు వారాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ నటి ఒకరు యశ్ అండ్ ప్రభాస్ మరియు రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ అంటూ మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఆమె ఎవరో కాదు కెజిఎఫ్ చాప్టర్ 2 లో భారత ప్రధాని కేరెక్టర్ లో నటించి యశ్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న రవీనా టాండన్. రీసెంట్ గా రవీనా ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ ఇకపై టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటూ ఏమి ఉండవని.. అంతా ఇండియన్ మూవీనే అని, పాన్ ఇండియా మార్కెట్ లో ఇకపై ప్రభాస్, యాష్, రామ్ చరణ్ పేర్లకు మత్రమే వినబడతాయని చెప్పిన రవీనా అక్కడ బన్నీ, ఎన్టీఆర్ లని అవాయిడ్ చెయ్యడం ఆయా హీరోల ఫాన్స్ కి నచ్ఛలేదు. బన్నీ, ఎన్టీఆర్ కూడా చరణ్, యాష్ కన్నా ఎక్కువే పేరు తెచ్చుకున్నారు. కానీ రవీనా వారి పేర్లు మరువడం మాత్రం ఎన్టీఆర్, బన్నీ ఫాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి.  

Raveena Tandon Shocking comments about Pan India Stars:

Actress Raveena Tandon Shocking Comments on Yash, Ram Charan, Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ