Advertisementt

హిందీలో కెజిఎఫ్ చాప్టర్ 2 సంచలనం

Fri 15th Apr 2022 01:19 PM
kgf 2,kgf chapter 2,kgf 2 day 1 box office collection,yash,prashanth neel  హిందీలో కెజిఎఫ్ చాప్టర్ 2 సంచలనం
KGF Chapter 2 sensation in Hindi హిందీలో కెజిఎఫ్ చాప్టర్ 2 సంచలనం
Advertisement
Ads by CJ

కన్నడ కెజిఎఫ్ మరోసారి రికార్డుల వేట మొదలు పెట్టింది. కెజిఎఫ్ చాప్టర్ వన్ తోనే అంచనాలు లేకుండా కోట్లు కొల్లగొట్టుకుని పోయిన యశ్ అండ్ ప్రశాంత్ నీల్ లు ఇప్పుడు కెజిఎఫ్ చాప్టర్ 2 తో భారీ అంచనాలతో బరిలోకి దిగి.. ఆ అంచనాలు అందుకోవడమే కాదు, హిట్ టాక్ తో రికార్డ్ కలెక్షన్స్ కి ఎసరు పెట్టారు. పాన్ ఇండియా లో అతి పెద్ద మార్కెట్ హిందీలో కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ టాక్ తో మొదటి రోజే రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం హాట్ టాపిక్ అయ్యింది. యశ్ హీరోయిజం, యాక్షన్ ఘట్టాలు, ఎమోషన్స్ అన్నిటికి నార్త్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

కెజిఎఫ్ 2 మొదటి రోజే హిందీ లో 53.95 కోట్లు కొల్లగొట్టి.. అక్కడి హీరోలకి, మీడియాకి భారీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే హృతిక్ రోషన్ వార్ మూవీ కూడా ఎన్నో అంచనాలు మధ్యన మొదటి రోజు 53.35 కోట్లు మాత్రమే తెచ్చింది. కానీ ఇప్పుడు హిందీలో కెజిఎఫ్ ఓపెనింగ్స్ అదిరిపోయాయి అనడానికి ఈ ఫిగర్ ఉదాహరణ. 3000+ స్క్రీన్ లో హిందీలో రిలీజ్ అయిన కెజిఎఫ్ 2 కి నార్త్ ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో.. ఆ సినిమాపై ఎంత హైప్ ఉందొ ఆ సినిమాకొచ్చిన మొదటి రోజు ఓపెనింగ్స్ చూస్తే అర్ధమైపోతుంది. కన్నడ నుండి విడుదలైన కెజిఎఫ్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ అన్ని భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. హిందీ మీడియాలో కెజిఎఫ్ ని తొక్కేయాలని చూసినా.. కలెక్షన్స్ ప్రభంజనంతో కెజిఎఫ్ 2 సత్తా చూపెట్టింది.

KGFChapter2: 53.95 కోట్లు 

War:     53.35 కోట్లు 

Thugs of Hindostan: 52.25 కోట్లు

Sanju: 46.71 కోట్లు

Baahubali2: 46.5 కోట్లు 

TigerZH: 45.53 కోట్లు

HappyNY: 44.97 కోట్లు 

Dangal: 42.41 కోట్లు 

KGF Chapter 2 sensation in Hindi:

KGF 2 Day 1 Hindi Box Office Collection

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ