పూజ హెగ్డే ని రివీల్ చేసేసారు

Pooja Hegde enters F3Pooja Hegde enters F3

ఇప్పుడు టాప్ హీరోయిన్స్ అయిన స్టార్స్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్ అవకాశాలు వస్తే అస్సలు వదులుకోవడం లేదు. కాజల్, శృతి హాసన్, తమన్నా నిన్నగాక మొన్న ఉ అంటావా మావ ఉ ఊ అంటావా మావా సాంగ్ తో సమంత యూత్ ని ఓ ఊపు ఊపేసింది. గతంలో పూజ హెగ్డే కూడా రామ్ చరణ్ రంగస్థలం లో జిగేలు రాణి స్పెషల్ సాంగ్ చేసి అందరి చూపు తనపై పడేలా చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్ కి సై అంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు పట్టేస్తున్న పూజ హెగ్డే కి అనిల్ రావిపూడి ఎఫ్ 3 లో ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పించారు. 

ఈ సాంగ్ కోసమే పూజ హెగ్డే కోట్లు డిమాండ్ చేసింది అనే ప్రచారం జరిగింది. నిన్నమొన్నటివరకు పూజ హెగ్డే ఎఫ్ 3 లో స్పెషల్ సాంగ్ విషయం గాసిప్ గానే ఉన్నా నేడు ఎఫ్ 3 టీం అధికారికంగా రివీల్ చేసింది. పూజ హెగ్డే బ్యాక్ లుక్ వదులుతూ ఎఫ్ 3 లో ఐటెం సాంగ్ చేయబోయేది ఈ హీరోయిన్ అంటూ హింట్ ఇవ్వడంతో ఆమె పూజ హెగ్డే నే ఇంకెవరో కాదు అంటూ అందరూ ఫిక్స్ అవుతున్నారు. మరి పూజ హెగ్డే రంగస్థలం తర్వాత మరోసారి టాలీవుడ్ ని ఊపెయ్యబోతుందన్నమాట. ఇక ఎఫ్ 3 లో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ కాగా,. సోనాల్ చౌహన్ మరో కేరెక్టర్ లో మెరవనుంది.  

.

Pooja Hegde special song in F3

pooja hegde
f3
anil ravipudi
venkatesh
varun tej
samantha
tamanna
mehreen kaur