అలియా భట్ - రణబీర్ కపూర్ పెళ్లి అఫీషియల్ అయ్యింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు వారి నుండి ఇరువురు వెడ్డింగ్ పై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. కానీ ఈ రోజు సాయంత్రం 7 గంటలకి అలియా భట్ - రణబీర్ కపూర్ వెడ్డింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గత ఐదేళ్లుగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అదే బాల్కనీలో మా పెళ్లి జరగడం మాకెంతో సంతోషం ఉంది అంటూ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకోగానే.. ఆ ఫొటోస్ ఇట్టే వైరల్ అయ్యాయి. అలియా భట్ ప్రేమగా, సిగ్గుతో రణబీర్ కపూర్ ముందు తలవంచి తాళి కట్టించుకుంది. రణబీర్ కపూర్ అంతే ప్రేమతో ముద్దడుతూ అలియా నుదుటున కుంకుమ దిద్దిన ఫొటోస్ ని చూస్తే ఆ జంటని చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదు అంటారు.
క్రీం కలర్ డ్రెస్సులతో రణబీర్ - అలియా లు అద్భుతంగా కనిపిస్తున్నారు. వెడ్డింగ్ జ్యువలరీతో చేతులకి మెహిందీ తో అలియా భట్ మెరిసిపోతుంది. పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతుంది. సినిమాల్లో ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్న ఈ జంట రియల్ లైఫ్ లో మళ్ళీ మళ్ళీ రాని ఘట్టాన్ని ఎంతో క్యూట్ గా, అందంగా పూర్తి చేసింది. మెడలో వరమాలతో అలియా భట్ - రణబీర్ కపూర్ ల జంటకి మా దిష్టే తగులుతుంది అనేంత అందంగా కనిపిస్తున్నారు.