లక్షలు ఖర్చు పెడుతూ బిగ్‌బాస్ అనే గేమ్ గెలిచెయ్యాలని ఒకరిపై మరొకరు డిజిటల్ మీడియాని అడ్డం పెట్టుకుని బురదని చల్లటానికి బాగానే కుస్తీ పడుతున్నారని బయట ఫేస్‌బుక్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లలో బయటపడిపోతుంది.
అందులో తెలివిగా వ్యవహరిస్తూ ముందుండే బిందు మాధవి టీం మెల్లమెల్లగా ఒక్కొక్క కంటెస్టెంట్‌లపై డిజిటల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ వాడకూడని పదాలు వాడుతూ సైబర్ క్రైం కేసుల్లో చిక్కుకున్నారని తెలుస్తుంది.
ఆ సైబర్ క్రైం డిపార్ట్‌మెంట్ ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లు తమ ఆటని తాము ఆదుకోవాలి గానీ ఇంకొకరి భార్యల్ని, పిల్లల్ని, కుటుంబాల్ని బయట నుంచి దూషించడం తగదని పిలిచి గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తుంది. అఖిల్, నటరాజ్, అషూరెడ్డి, మహేష్‌లకి ఈ తెలివితేటలు లేకపోవటంతో బిందుమాధవి డిజిటల్ టీం వీళ్లని నెగిటివిటీతో టార్గెట్ చేసిందని, తమ టీంతోనే తిట్లు, శాపనార్థాలు కామెంట్లుగా పెట్టిస్తున్నారని తెలుస్తుంది.
నటరాజ్ ఎవరి గ్రూప్ లో లేఉండా ఒంటరిగా ఫైట్ చేస్తున్నాడు. నటరాజ్ గతంలో అచ్చు ఇలానే ముక్కు సూటిగా అది మధ్యలోనే ఎలిమినేటి అయ్యాడు. నటరాజ్ లో జాలి గుణం కూడా ఎక్కువేనట. తనకి తోచినట్లు దానాలు చేశాడని అంటున్నారు. అటు జీ ఛానల్ వాళ్ల ఈవెంట్స్, ఇటు మా ఛానల్ వాళ్ల ఈ వెంట్స్ బిజీ బిజీగా చేస్తూ తిరిగే ఈ నటరాజ్ ఈ బిగ్‌బాస్ రొంపిలో ఎందుకు దిగాడో అర్థం కాదు. ఏది ఏమైనా వీళ్ల కొట్లాడటాలు చూసే ఈ జనాలు అవి నిజమైన గొడవలు అని, వాళ్ల ఆవేశాలు, ఆరాటాలు, బాధలు, ఏడ్పులు అన్నీ నిజాలే అని నమ్ముతూ సీరియస్‌గా కామెంట్‌లు చేస్తూ నమ్మేస్తుంటారు. అది ఒక ఆట మాత్రమే, వాళ్లెవరు విలన్‌లు కారు.. హీరోలు కాదు.. అంతా బిగ్‌బాస్ రాసి ఆడించే స్క్రీన్ ప్లే. ఇందులో కంటెస్టెంట్‌లే కాదు ప్రేక్షకులు కూడా తెలియక నమ్మేస్తుంటారు.