ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆచార్య సినిమాపై అంచనాలు బావున్నాయి. మెగా ఫాన్స్ మాత్రమే కాదు చాలామంది ఆచార్య రాక కోసం ఆతృతగా ఉన్నారు. మెగాస్టార్ చిరు - రామ్ చరణ్ కలిసి నటించడంతో సినిమాపై ఆసక్తి, క్యూరియాసిటీ, అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 29 న రాబోతున్న ఆచార్య కి ఇప్పుడు పరీక్షల గండం వెంటాడుతుంది. ఎప్పుడో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ లలో స్టూడెంట్స్ అంతా పరిక్షలు రాసి ఆ టెంక్షన్ నుండి కూల్ అయ్యి సమ్మర్ సినిమాలను ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు పాండమిక్ సిట్యువేషన్ కాబట్టి అకాడమిక్ ఇయర్ అలా అలా జరిగి ఏప్రిల్ అండ్ మే కి షిఫ్ట్ అయ్యింది.
ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు 10th, ఇంటర్ పరీక్షల హడావిడి ఉంది. స్టూడెంట్స్ అంతా పరీక్షల ఫీవర్ లో ఉంటారు. ఇక సినిమాలపై మూడ్ ఏం ఉంటుంది. అటు మార్చ్ నెలాఖరులో వచ్చి ట్రిపుల్ ఆర్ కూల్ గా గట్టెక్కేసింది. కానీ ఇప్పుడు రాబోయే ఆచార్య కి ఈ పరీక్షల దెబ్బ బాగా పడేట్టుగా కనిపిస్తుంది. ఆచార్య రిలీజ్ అయ్యేది మంచి పరిక్షల టైం లో.. అలా సినిమాకి వెళ్లంటే పేరెంట్స్ ఆలోచిస్తారు. ఇటు స్టూడెంట్స్ వెళ్ళలేరు. సో అలా ఫ్యామిలీ ఆడియన్స్ ఆచార్య కి దూరమయ్యే పరిస్థితి లేకపోలేదు.