Advertisementt

బీస్ట్ థియేటర్ స్క్రీన్ కి నిప్పు పెట్టిన విజయ్ ఫాన్స్

Wed 13th Apr 2022 01:09 PM
vijay,vijay beast movie,beast theatre screen,vijay fans  బీస్ట్ థియేటర్ స్క్రీన్ కి నిప్పు పెట్టిన విజయ్ ఫాన్స్
Vijay fans made fire on the screen while watch Beast Movie బీస్ట్ థియేటర్ స్క్రీన్ కి నిప్పు పెట్టిన విజయ్ ఫాన్స్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ విజయ్ - నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కిన బీస్ట్ మూవీ ఈ రోజే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. గత కొన్ని రోజులుగా విజయ్ మూవీ తమిళ్ లో తప్ప మరెక్కడా హిట్ అవడం లేదు. గతంలో వచ్చిన మాస్టర్ సినిమా కూడా ఫాన్స్ కి నచ్చింది కానీ.. రొటీన్ స్టోరీ తో ఉన్న ఆ సినిమా ఆడియన్స్ కి నచ్చలేదు. ఇక తాజాగా విడుదలైన బీస్ట్ సినిమాకి సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడమే కాదు, మొదటి షో చూసాక చాలామంది బీస్ట్ గురించి నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. ఈ సినిమాపై ఫాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. 

సినిమాకొచ్చిన నెగెటివ్ టాక్ చూసి ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్తే చివరికి నిరాశతో వెనుదిరిగి రావాల్సి వస్తోందంటూ దిగులుగా కామెంట్లు చేస్తున్నారు. దానితో విజయ్ ఫాన్స్ బీస్ట్ థియేటర్ కి నిప్పు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. తమిళనాట ఓ థియేటర్‌లో సినిమా చూస్తున్న కొందరు విజయ్ ఫాన్స్ బీస్ట్‌ సినిమా నచ్చకపోవడంతో స్క్రీన్‌కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా నచ్చకపోతే పోస్టర్స్ చింపడం, కటౌట్స్ కూల్చడం లాంటివి చూసాం కానీ ఇలా థియేటర్స్ స్క్రీన్ నిప్పంటించడం ఎక్కడా చూడలేదంటున్నారు నెటిజెన్స్.

Vijay fans made fire on the screen while watch Beast Movie:

Vijay Beast Movie Theatre Screen on Fire, Luckily everyone saved

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ