బాలకృష్ణ మాస్ అవతార్ లో అఖండ మూవీ తో అదరగొట్టేసి మాస్ ఆడియన్స్ కి అదిరిపోయే కిక్ ఇచ్చారు. అఖండ జాతర నిన్నటి ఆదివారం బుల్లితెర మీద ప్రసారమవడంతో ముగిసింది. అదే బాటలో బాలయ్య NBK107 ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. NBK107 లో బాలయ్య ఫ్యాబులస్ లుక్ లో కనువిందు చేస్తున్నారు. ఈ సినిమా కూడా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కుతుంది. ఆ తర్వాత కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడిలో దర్శకత్వంలో బాలయ్య సినిమా ఫిక్స్ అయ్యింది. అయితే రీసెంట్ గా అనిల్ రావిపూడి బాలయ్య సినిమాపై స్పందిస్తూ.. బాలయ్యని ఎలా చూడాలని ఆడియన్స్ ఇష్టపడతారో.. అలానే నేనూ నా సినిమాలో చూపించే ఉద్దేశ్యంలో ఉన్నాను.
నా మార్కు ఎంటర్టైన్ మెంట్ ను ఆ మాస్ కి ఎలాగో అలా యాడ్ చేస్తాను. కాకపోతే ఇదివరకు నేను తీసిన సినిమాల మాదిరిగా ఎక్కువ కామెడీని మాత్రం చేయలేము. బాలకృష్ణ స్ట్రెంత్ ఏమిటో చూసి ఆయన ఇమేజ్ కి తగ్గకుండా, దానికి వ్యతిరేఖంగా వెళ్లకుండా, బాలయ్య ని ఓ డిఫరెంట్ జోనర్ లో ప్రెజెంట్ చెయ్యాలని, అందుకే ఆయన లుక్, ఆయన బాడీ లాంగ్వేజ్, అలాగే భాష విషయంలో ప్రత్యేకంగా శ్రద్ద పెడుతున్నట్లుగా చెప్పిన అనిల్ రావిపూడి ఈ కథ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అంటూ బాలయ్య మూవీపై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి