Advertisementt

నా ఫేవరేట్ హీరో ఆయనే: కెజిఎఫ్ డైరెక్టర్

Tue 12th Apr 2022 08:18 PM
chiranjeevi,prashanth neel,kgf 2,yash,ntr,prabhas  నా ఫేవరేట్ హీరో ఆయనే: కెజిఎఫ్ డైరెక్టర్
Chiranjeevi is my favourite hero, says KGF 2 director నా ఫేవరేట్ హీరో ఆయనే: కెజిఎఫ్ డైరెక్టర్
Advertisement
Ads by CJ

కెజిఎఫ్ తో పాన్ ఇండియాలో సంచలన రికార్డులు నమోదు చేసి.. హీరోయిజాన్ని ఎలా ప్రెజెంట్ చెయ్యాలో చెప్పిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ నుండి ఇప్పుడు కెజిఎఫ్ 2 రాబోతుంది. మరొక్క రోజులో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతున్న కెజిఎఫ్ ప్రమోషన్స్ లో ఆ హీరో యశ్ తో పాటుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ బిజీగా వున్నారు. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తో టాలీవుడ్ టాప్ స్టార్స్ ని పడేసి సినిమాలు కమిట్ చేయించేసారు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ప్రమోషన్స్ లో తనకి ఫేవరేట్ హీరో ఎవరు అన్న ప్రశ్నకి మెగాస్టార్ చిరు అని చెప్పడమే కాదు, చిన్నప్పటినుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. 

నా సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ బావుంటాయని అందరూ అంటారు. నేను హీరో ఎలివేషన్ సీన్స్ అంత బాగా తియ్యడానికి చిరంజీవి గారే కారణం. ఆయన సినిమాల్లో హీరోయిజానికుండే సీన్స్ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసాయి. తన సినిమాలోని హీరో కూడా చిరు లా ఉండాలని కోరుకుంటాను.. అందుకేనేమో నా సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ అందరికి నచ్చుతాయి అంటూ ప్రశాంత్ నీల్ చెప్పారు. సో కెజిఎఫ్ ప్రమోషన్స్ లో ప్రశాంత్ నీల్ అవకాశం వచ్చినప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్ గురించి మాట్లాడుతూ వాళ్ళ ఫాన్స్ ని, ఇటు చిరు గురించి చెప్పి మెగా ఫాన్స్ ని బుట్టలో పడేసారు అనేది మాత్రం వాస్తవం. 

Chiranjeevi is my favourite hero, says KGF 2 director:

Chiranjeevi is my favourite hero, says Prashanth Neel

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ