ఈ రోజు సాయంత్రం అంటే మరికాసేపట్లో ఆచార్య ట్రైలర్ కి రంగం సిద్ధం అయ్యింది. 153 థియేటర్స్ లో ఆచార్య ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ లోను ఆచార్య ట్రైలర్ కి టైం సెట్ చెయ్యడమే కాదు.. ఈ రోజు ఉదయం నుండి ఆచార్య ట్రైలర్ కౌన్ డౌన్ పోస్టర్స్ తోనే మెగా ఫాన్స్ కి కిక్ ఇస్తున్నారు. కొరటాల శివ ఆచార్య ట్రైలర్ లో ఏం కట్ చేసారో అనే ఆత్రుత కన్నా మెగాస్టార్ చిరు - రామ్ చరణ్ లు ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫొటోస్ ని రివీల్ చేస్తూ ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు.
చిరు, చరణ్ నక్సలైట్ లుక్స్ లో గన్స్ పట్టుకుని చిరుత పులుల్లా కనిపిస్తున్నారు. టీజర్ కట్ చివరిలో చిరుత, పులి మీద నుంచి.. చిరంజీవి, రామ్ చరణ్ మీదకు తీసుకొచ్చిన షాట్ చూసి మెగా ఫాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. ట్రైలర్‌లో ఫస్ట్ ఎంట్రీ రామ్ చరణ్‌దేనట.. చివర్లో ఫైట్ షాట్‌లో ఇద్దరూ కలిసి కుమ్మేస్తారని టాక్. అలాగే తాజాగా రామ్ చరణ్ సిద్ధగా, పూజ హెగ్డే నీలాంబరి లుక్స్ లో కొరటాలతో మాట్లాడుతున్న పోస్టర్ వదిలారు. ఇప్పుడు ఈ పోస్టర్స్ తోనే మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ట్రైలర్ వస్తే ఆగుతారా..