Advertisementt

బిగ్ బాస్: మిత్రా పై స్రవంతి కామెంట్స్

Tue 12th Apr 2022 03:48 PM
sravanthi,mitraaw sharma,bigg boss nonstop,bigg boss,bigg boss nonstop show  బిగ్ బాస్: మిత్రా పై స్రవంతి కామెంట్స్
Bigg Boss Nonstop: Sravanthi comments on Mitraw Sharma బిగ్ బాస్: మిత్రా పై స్రవంతి కామెంట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు, బయట ఉన్న ఆడియన్స్ అలాగే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా మిత్రా శర్మ ఇంకా హౌస్ లో ఎలా అంది అంటూ షాకవుతూనే ఉన్నారు. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి అర్హత లేని కంటెస్టెంట్ గా మిత్రా శర్మ మొదటి వారం నుండే కనిపిస్తుంది. గేమ్ లో ఆడదు, అసలు ఆమె ఎలా కంటిన్యూ అవుతుందో అని అందరూ అనుకుంటున్నా, ప్రతి వారం నామినేషన్స్ లోకి వెళ్లి మరీ సేవ్ అవుతుంది ఆమె. అయితే ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరూ ఆమె ఎలా హౌస్ లో కంటిన్యూ అవుతుందో తెలియడం లేదు అన్నట్టుగానే.. గత వారం ఎలిమినేట్ అయిన స్రవంతి కూడా ఇంకా ఆమె హౌస్ లో ఎలా ఉందొ అంటూ మిత్రా శర్మ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

మిత్రా శర్మకి యాంకర్ శివ కి ఒక్కరే పీఆర్వో అని, అతనే బాలు అని, బాలు నే వీళ్ళ పబ్లిసిటీ చూసుకుంటాడని, అయితే శివ తో మిత్రా మొదటి రెండు వారాలు బాగానే ఉన్నా.. తర్వాత శివ ని, చైతూ ని నామినేట్ చేసింది. అప్పుడు అందరం షాక్ తిన్నాం. ఇక శివకి స్రవంతికి గొడవ జరిగాక శివ కి బట్టలు పంపవద్దని ఆమె పీఆర్వో బాలు కి కెమెరా దగ్గర చెప్పగానే అతనికి బట్టలు రావడం ఆగిపోయాయని, శివ ఆమెకి అన్నం కూడా తినిపించాడని, కానీ నాగ్ సర్ దగ్గర తనని ఎవరూ చూడడం లేదని చెప్పేది, ఇక నేను బయటికి వచ్చేటప్పుడు కూడా స్టేజ్ పై తన గురించి మంచిగా చెప్పండి అంటూ అడిగింది అని స్రవంతి షాకింగ్ కామెంట్స్ చేసింది. 

Bigg Boss Nonstop: Sravanthi comments on Mitraw Sharma :

Bigg Boss Nonstop: Sravanthi Shocking comments on Mitraaw Sharma

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ