ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసి తొందరగా ఫెడవుట్ అయినా.. ఇప్పుడు సీనియర్ హీరోస్ సినిమాల్లోనూ, వెబ్ సీరీస్ తోనూ, బుల్లితెర మీద డాన్స్ షో లకి జేడ్జ్ గాను సత్తా చాటుతున్న ప్రియమణి.. సన్నగా అందంగా నాజూగ్గా తయారైంది. ఆ మధ్యన ప్రియమణి భర్తతో విడిపోబోతుంది అంటూ ప్రచారం జరగడం ఆ విషయమై ప్రియమణి నెటిజెన్స్ పై కాస్త సీరియస్ అవడం చూసాం. తాజాగా బాడీ షేమింగ్, డ్రెస్సింగ్, బిహేవియర్ లపై సోషల్ మీడియాలో జరిగే నెగిటివ్ కామెంట్స్ పై స్పందించింది ప్రియమణి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు, కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయితే.. కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తారు.. సెలబ్రిటీలు టార్గెట్‌గా కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు.
చాలామంది సెలబ్రిటీస్ ఇలాంటి ట్రోల్స్ పై గరం గరమవుతుంటారు. తాజాగా ప్రియమణి హద్దులు మీరు కామెంట్స్ చేస్తే తాను అస్సలు భరించలేను అని అలాంటి వాళ్ళని అన్ ఫాలో చేస్తానని చెప్పింది. సోషల్ మీడియా లో ఏం అనాలనిపిస్తే అది అనే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని చాలా మంది ఫీలవుతుంటారు. నా మీద వచ్చే మీమ్స్, కామెంట్స్ చూసి చాలాసార్లు నవ్వుకునేదాన్ని. కానీ కొంతమంది హద్దు మీరు చేసిన కామెంట్లు భరించలేకపోయేదాన్ని. అందుకే వెంటనే వాళ్లను బ్లాక్ చేసి పడేసేదాన్ని. సోషల్ మీడియా లైఫ్‌లో ఒక భాగం మాత్రమే కానీ అదే జీవితం కాదనేది నా అభిప్రాయం.. అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.