Advertisementt

జబర్దస్త్ కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నా

Tue 12th Apr 2022 01:18 PM
jabardasth,appa rao,jabardasth appa rao,mallemala,star maa  జబర్దస్త్ కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నా
Is in a better position than Jabardasth జబర్దస్త్ కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నా
Advertisement
Ads by CJ

జబర్దస్త్ నుండి చాలామంది కమెడియన్స్ వెళ్లిపోయారు. అయితే జబర్దస్త్ నుండి కావాలనే కమెడియన్స్ తప్పుకున్నారు అనుకున్నారు చాలామంది. కానీ జబర్దస్త్ వాళ్లే వాళ్ళని హోల్డ్ లో పెట్టడంతో వారు కొన్నాళ్ళు వేచి చూసి మరీ ఇతర ఛానల్స్ కి వెళ్ళినట్టుగా జబర్దస్త్ సీనియర్ కమెడియన్ అప్పారావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం, జబర్దస్త్ పై సంచలన కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జబర్దస్త్ తనకి అన్నం పెట్టింది అని, మల్లెమాల ఇచ్చిన సపోర్ట్ తోనే తాను ఇప్పుడు ఇంటర్వూస్ ఇచ్చే స్థితికి చేరుకున్నాను అని, కాకపోతే జబర్దస్త్ వాళ్ళే తనని హోల్డ్ లో పెట్టడం వలన తాను వేరే ఛానల్ కి వెళ్ళాను అని చెప్పాడు. ఇక జబర్దస్త్ నుండి తనని తీసెయ్యడానికి నానా రకాల రూమర్స్ క్రియేట్ చేసారని, బిగ్ బాస్ కి వెళుతున్నాను, జబర్దస్త్ మానేస్తున్నా అంటూ చాలా చేసారని వాపోయాడు.

జబర్దస్త్ లో మోసేవాళ్లు, కూసేవాళ్ళు, తోసేసేవాళ్ళు చాలామంది ఉన్నారని, నేను ఎప్పుడూ స్కిట్స్ కి దూరం అవడం కానీ, స్కిట్ రిహార్సల్స్ కి రాకపోవడం కానీ, టైం కి లేకపోవడం కానీ చెయ్యలేదని, తాను చాలా సిన్సియర్ గా ఉన్నాను అని, జబర్దస్త్ నా లైఫ్ అనుకున్నాను, ఇప్పటికి అదే అనుకుంటున్నాను. బయటికి వచ్చేస్తే సీనియర్ కదా కనీసం ఎవరూ మాట్లాడడానికి కూడా ట్రై చెయ్యలేదు. జబర్దస్త్ లో సీనియర్ లకి గౌరవం లేదు అన్న అప్పారావు తనని జబర్దస్త్ కి తీసుకు వచ్చింది షకలక శంకర్ అని, అయితే తాను ఇప్పుడు జబర్దస్త్ కన్నా బెటర్ పొజిషన్ లో ఉన్నాను అని, నాకు జబర్దస్త్ షో ఫస్ట్ షో కాదని అంతకుముందు చాలా షోస్ చేశాను అంటూ అప్పారావు చెప్పుకొచ్చారు.

Is in a better position than Jabardasth:

Jabardasth Appa Rao Real Facts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ