రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ ఆనందంలో మునిగి తేలడమే కాదు ఆయన తదుపరి చిత్రాలపై కూడా దృష్టి పెట్టారు. ఆచార్య డబ్బింగ్ పూర్తి చేసి RC 15 షూటింగ్ కి వెళ్లిపోయారు. RC 15 పంజాబ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఆచార్య ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ యూనివర్సిటీలో బుక్స్ చేతబట్టాడు. అది కూడా హీరోయిన్ కియారా అద్వానీతో కలిసి. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ తో కియారా రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం RC 15 షూటింగ్ పంజాబ్ లోని అమృత్ సర్ లోని ఓ యూనివర్సిటీలో జరుగుతుంది.
అమృత్ సర్ లోని గురు నానక దేవ్ యూనివర్సిటీలో ప్రస్తుతం రామ్ చరణ్, కియారా లపై శంకర్ కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడి షూటింగ్ స్పాట్ నుండి కొన్ని వీడియోస్ లీకై ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్, కియారా మీద కాలేజ్ సీన్స్ షూట్ చేసినట్టుగా కొన్ని లీకుల వీడియోస్, ఫొటోస్ చెబుతున్నాయి. దానితో యూనిట్ తలపట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ లీకెడ్ వీడియోస్ లో లైట్‌గా బియర్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించబోతోన్నాడని తెలుస్తుంది. RC 15 షూటింగ్ పరిసర ప్రాంతాల్లో అభిమానుల తాకిడి ఎక్కువవడంతో ఎవరు ఇలా సెట్స్ నుండి వీడియోస్ లీక్ చేస్తున్నారో అర్ధం కాక యూనిట్ నానాతంటాలు పడుతున్నారట.