Advertisementt

సలార్ పై ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Tue 12th Apr 2022 11:26 AM
salaar 2,salaar movie,prabhas,kgf 2,kgf chapter 2,prashanth neel  సలార్ పై ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Prashanth Neel giving a twist on Salaar two parts సలార్ పై ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Advertisement
Ads by CJ

కెజిఎఫ్ అనుకోని హిట్ అవడంతో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కి అదిరిపోయే అవకాశాలు ఇచ్చేసారు హీరోలు. కెజిఎఫ్ 2 సినిమా చేస్తున్నప్పుడే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్, ఎన్టీఆర్ తో NTR31 పాన్ ఇండియా మూవీస్ తో టాప్ లోకి వచ్చేసారు. ప్రస్తుతం కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ తో ప్రశాంత్ నీల్ బిజీగా వున్నారు. కెజిఎఫ్ 2 మరో రెండు రోజుల్లో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ హైప్ ముందు కెజిఎఫ్ చాప్టర్ 2 పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే కెజిఎఫ్ ప్రమోషన్స్ లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న సలార్ మూవీ, అలాగే NTR31 పై అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నారు.

అందులో ముఖ్యంగా ప్రభాస్ సలార్ పై అదిరిపోయే అప్ డేట్స్ ఇచ్చారు. ప్రభాస్ కేరెక్టర్ సలార్ లో చాలా క్రూరంగా ఉంటుంది అని, అలాగే సలార్ రెండు పార్ట్ లపై తాజాగా ప్రశాంత్ నీల్ ట్విస్ట్ ఇచ్చారు. అదేమిటంటే సలార్ రెండు భాగాలుగా రాబోతున్నట్టుగా  ప్రచారం జరుగుతుంది. అందులో నిజమెంత అని ఆయన్ని అడగగా.. దానికి ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు సలార్ ని రెండు భాగాలుగా చూపిద్దామని అనుకోలేదు. ఒకవేళ అదే నిజమైతే ఓ పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసి సలార్ రెండు భాగాలుగా రాబోతున్నట్టుగా అనౌన్స్ చేస్తామంటూ ట్విస్ట్ ఇచ్చారు. దానితో ప్రభాస్ ఫాన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. సలార్ ఒకటేనా.. రెండు భాగాలుగా వస్తుందా అనే అనుమానంలో ఉన్నారు.  

Prashanth Neel giving a twist on Salaar two parts:

Salaar 2 Parts But we will plan and announce a big event: Prashanth Neel

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ