Advertisementt

బిగ్ బాస్: ఈ వారం నామినేషన్స్ లిస్ట్

Tue 12th Apr 2022 10:48 AM
bigg boss,bigg boss non stop,7th week nominations list,anil,ariyana,akhil,bindu madhavi  బిగ్ బాస్: ఈ వారం నామినేషన్స్ లిస్ట్
Bigg Boss Non Stop: This Week Nominations List బిగ్ బాస్: ఈ వారం నామినేషన్స్ లిస్ట్
Advertisement
Ads by CJ

గత వారం డబుల్ నామినేషన్స్ లో భాగంగా ముమైత్ ఖాన్, స్రవంతి లు ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం నామినేషన్స్ లో బాగా గొడవలు జరిగాయి. తమని నామినేట్ చేశారన్న కసితో మిగతా కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. ఈ వారం నామినేషన్స్ లో ఇద్దరు ముందుకు వచ్చి తమని తాము ఎందుకు నామినేషన్స్ లోకి వెళ్లకుండా ఉండాలో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. మిగతా వారు నామినేట్ అవ్వడానికి బిగ్ బాస్ వారి మీద బురద పోస్తాడు. అందులో ముందుగా హమీద - అనిల్ వెళ్లారు. అనిల్ - హమీద ఇద్దరూ మధ్యన గొడవ బాగా జరిగింది. వాళ్లలో అనిల్ నామినేట్ అయ్యాడు. ఇక మహేష్ - మిత్ర శర్మ లో మిత్ర శర్మ నామినేషన్స్ లోకి వెళ్ళింది.. అజయ్ కోసం అరియనా తనని తాను నామినేట్ చేసుకుంది.

ఇక తర్వాత నటరాజ్ మాస్టర్ కి - యాంకర్ శివ కి భీబత్సమైన గొడవ జరిగింది. ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటూ ఎడతెగకుండా గొడవ పడేసరికి బిగ్ బాస్ ఇద్దరినీ నామినేషన్స్ లోకి పంపేశాడు. ఇక అఖిల్ - బిందు మాధవి మధ్య అయితే అరేయ్, వసేయ్ అంటూ రెచ్చిపోయి గొడవపడేసరికి వాళ్లలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. దానితో వాళ్ళిద్దరిని డైరెక్ట్ గా బిగ్ బాస్ నామినేట్ చేసాడు. ఇక కెప్టెన్ ఆశు రెడ్డి కి డైరెక్ట్ గా నామినేట్ చేసే ఛాన్స్ రాగా ఆమె మహేష్ ని నామినేట్ చెయ్యడంతో అప్పుడు పెద్ద రచ్చ చేసాడు మహేష్.  చివరికి ఈ వారం 8 మంది నామినేట్ అవ్వగా.. మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్, ఆరియానా, అఖిల్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ లు ఉన్నారు.

Bigg Boss Non Stop: This Week Nominations List:

Bigg Boss: 7th Week Nominations List

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ