Advertisementt

పూజ హెగ్డే వదిలేస్తే రశ్మిక పెట్టేసింది

Mon 11th Apr 2022 10:12 PM
dil raju,pooja hegde,thalapathy 66,vijay,vamshi paidipally,rashmika mandanna  పూజ హెగ్డే వదిలేస్తే రశ్మిక పెట్టేసింది
Pooja Hegde Vs Rashmika Mandanna పూజ హెగ్డే వదిలేస్తే రశ్మిక పెట్టేసింది
Advertisement
Ads by CJ

పూజ హెగ్డే - రష్మిక ఇద్దరూ లక్కీ హీరోయిన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరూ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో మరో హీరోయిన్ కి ఛాన్స్ రాకుండా చేస్తున్నారు. రష్మిక లేదంటే పూజ హెగ్డే అన్నట్టుగా ఉంది తెలుగు, తమిళం హీరోల పరిస్థితి. మరోపక్క బాలీవుడ్ లోనూ ఈ భామలు పోటీ పడుతున్నారు. పాన్ ఇండియా మూవీస్ చేస్తూ కిర్రాక్ అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే మాట లేకుండా ఇద్దరూ సమానమైన సినిమాలతో క్రేజీగా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు పూజ హెగ్డే వదిలేసిన ఓ సినిమా రష్మికకి తగిలింది. పూజ హెగ్డే ఖాళీ లేక చెయ్యను అనుకున్న సినిమాని రష్మిక ఒడిసిపట్టుకుంది.

అది ఏ సినిమానో కాదు వంశీ పైడిపల్లి - విజయ్ కలయికలో దిల్ రాజు మూడు భాషల్లో నిర్మిస్తున్న సినిమాలో ముందుగా దిల్ రాజు వాళ్ళు పూజ హెగ్డే ని హీరోయిన్ గా అనుకున్నారట. ప్రస్తుతం పూజా హెగ్డే లక్కీ గర్ల్‌గా మారిందని, టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించింది.. వాళ్లతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేసింది.. అందుకే ఆమెని సంప్రదించగా.. పూజ హెగ్డే బోలెడన్ని కమిట్మెంట్స్ వలన డేట్స్ ఖాళీ లేవు అని చెప్పడంతో మళ్ళీ విజయ్ సరసన పూజ హెగ్డే ని రిపీట్ చెయ్యడం కరెక్ట్ కాదని, అందుకే ఆమె ప్లేస్ లోకి రశ్మికని తీసుకున్నట్టుగా దిల్ రాజు చెప్పారు. సో అలా పూజ వదులుకున్న పాత్ర రశ్మికకి తగిలిందన్నమాట. 

Pooja Hegde Vs Rashmika Mandanna:

Dil Raju reveals that Pooja Hegde was the first choice for Thalapathy 66

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ