Advertisementt

బిగ్ బాస్: మిత్రా శర్మని పొగిడేసిన స్రవంతి

Mon 11th Apr 2022 09:13 PM
bigg boss nonstop,bigg boss,sravanthi,mitraw sharma  బిగ్ బాస్: మిత్రా శర్మని పొగిడేసిన స్రవంతి
Bigg Boss Nonstop: Sravanthi Interview బిగ్ బాస్: మిత్రా శర్మని పొగిడేసిన స్రవంతి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఈ ఆది వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అందులో మొదటి వారం ఎలిమినేట్ అయ్యి మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళా ఒక్క వారానికే ఎలిమినేట్ అయ్యింది ముమైత్ ఖాన్. ఇక డబుల్ ఎలిమినేషన్ లో బలైన కంటెస్టెంట్ స్రవంతి. ఆమె హౌస్ నుండి బయటికి వచ్చాక పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇచ్చేస్తూ బిజీగా వుంది. ఆమె ఆ ఇంటర్వ్యూలో నేను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాక ఓ రెండు వారాల కన్నా ఎక్కువ ఉండలేను అని అర్ధమైంది. నాకు ఫైనాన్స్ ప్రోబ్లెంస్ ఉన్నాయి. నా కొడుకు ఫీజు కట్టాలని అనుకుంటున్న టైం లో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో వెళ్ళాను.

కానీ నాకు కరోనా రెండుసార్లు వచ్చి తగ్గడం వలన బ్రీతింగ్ ప్రోబ్లెంస్ వచ్చాయి. దానితో హౌస్ లోని ఏసీ లతో ఇబ్బంది పడేదాన్ని.. కానీ 20-30 లక్షలు అప్పు తీర్చాలనే భయంతోనే నేను హౌస్ లో మొండిగా ఉన్నాను. నేనేంటో తెలియకుండానే నటరాజ్ మాస్టర్ ఒక్కరు తప్ప నా వల్ల హౌస్ లో ఎవరూ ఇబ్బంది పడలేదు. మిత్ర శర్మ హౌస్ లో నా లైఫ్  గురించి చెప్పినప్పుడు ఐదు లక్షలు ఇస్తా అంది. నేను మా పని అమ్మాయి కూతురు పెళ్లి పది లక్షలు పెట్టి చేశాను. అలాంటిది మీరు అన్ను అమ్మా, అక్కలా చూసుకుని అన్నం పెట్టారు ఓ ఐదు లక్షలు ఇవ్వలేనా అంటూ చెప్పింది. మిత్ర ఇస్తదో ఇవ్వదో కానీ ఆమె కి నేను ఎవరో తెలియకుండానే సహాయం చేస్తా అంది. ఆరు వారాల పాటు నేను హౌస్‌లో జర్నీ చేసిన వాళ్లకే నేనేంటో సరిగా తెలియదు, వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేకపోయారు.. కానీ నేనేంటో తెలియని.. మిత్రా శర్మ నాకు సాయం చేస్తానని చెప్పింది అంటూ మిత్ర శర్మ మంచి తనాన్ని బయట పెట్టింది స్రవంతి.

Bigg Boss Nonstop: Sravanthi Interview:

Bigg Boss Nonstop: Sravanthi about Mitraw Sharma

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ