ఏప్రిల్ 14 న బాక్సాఫీసు దగ్గర బిగ్ ఫైట్ కి రెడీ అయ్యారు స్టార్ హీరోస్. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ, మరొకటి క్రేజీ మాస్ మూవీ, ఇంకొకటి క్లాసీ మూవీ. మూడు సినిమాల్లో ఏది తీసిపారెయ్యలేని సినిమాలే. మూడే సినిమాలపై ఆడియన్స్ అతృతతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అది ఏప్రిల్ 13 న తెలుగు, తమిళ, హిందీలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్, ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీ గా కన్నడ సంచలనం కెజిఎఫ్ 2, హిందీలో షాహిద్ కపూర్ జెర్సీ మూవీలు ఫైట్ కి రెడీ అయ్యాయి. అటు విజయ్ తగ్గడం లేదు. ఇటు కెజిఎఫ్ ఆగడం లేదు. జెర్సీ కూడా ఈరోజు వరకు టఫ్ ఫైట్ కి రెడీగానే ఉంది. మరోపక్క కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ లో దడదడ లాడిస్తుంది. విజయ్ బీస్ట్ పై క్రేజీ అంచనాలున్నాయి.
కానీ షాహిద్ కపూర్ జెర్సీ క్లాస్ మూవీ కావడంతో కెజిఎఫ్ పై హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఉండడంతో.. మళ్ళీ జెర్సీ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్. ఎప్పుడో డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన జెర్సీ కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడడంతో.. భారీ ఓటిటి ఆఫర్ వచ్చినా షాహిద్ మొండి పట్టుదలకు పోయి థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారు. అప్పుడు ఏప్రిల్ 14 డేట్ ఇచ్చాక కెజిఎఫ్ తో ఫైట్ షురూ అయ్యింది. అటు బీస్ట్ ఇటు కెజిఎఫ్ రెండు హిందీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యి ప్రమోషన్స్ చేస్తున్నాయి. అయితే మాస్ మూవీస్ ఫైట్ ఎందుకు కాస్త వెనక్కి తగ్గితే పోయేది లేదు అనుకున్నారో ఏమో.. మొత్తానికి జెర్సీ ని ఓ వారం పుష్ చేసారు. అంటే ఏప్రిల్ 14 న రిలీజ్ అవ్వాల్సిన జెర్సీ ఇప్పుడు ఏప్రిల్ 22 కి షిఫ్ట్ అయ్యింది. ఏప్రిల్ 22 న జెర్సీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.