మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో లవర్ బాయ్ లా అదిరిపోయే హిట్ కొట్టిన అక్కినేని అఖిల్.. తన తదుపరి మూవీ ని మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఏజెంట్ లో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఏజెంట్ గా అఖిల్ మేకోవర్ అందరిని ఆకర్షించింది. సిక్స్ ప్యాక్ బాడీ తో, లాంగ్ హెయిర్ తో అఖిల్ ఏజెంట్ గా రఫ్ అండ్ మాస్ మసాలా లుక్ లోకి మారిపోయాడు. చేతిలో సిగరెట్ తో, బైక్ పై అఖిల్ ఏజెంట్ లుక్ సెన్సేషనల్ అయ్యింది.
ఇక కాకినాడ ఫోర్ట్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు షూటింగ్ చేసుకున్న ఏజెంట్ ఇప్పుడు వైజాక్ కి షిఫ్ట్ అయ్యాడు. ఏజెంట్ మూవీ కొత్త షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేశారు. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారని, ఈ సీక్వెన్స్ ఇంటర్వెల్ లో వస్తుందని తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఏజెంట్ మూవీ ని తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమాలో ముంబై మోడల్ సాక్షీ వైద్య అఖిల్ తో రొమాన్స్ చెయ్యబోతుంది.