Advertisementt

బిగ్ బాస్: వారిద్దరిపై నాగ్ ఫైర్

Sun 10th Apr 2022 08:42 PM
bigg boss,bigg boss non stop,nagarjuna,nag fires,anchor shiva,nataraj master  బిగ్ బాస్: వారిద్దరిపై నాగ్ ఫైర్
Big Boss Non Stop: Nag fire on both contestants బిగ్ బాస్: వారిద్దరిపై నాగ్ ఫైర్
Advertisement
Ads by CJ

ఈ వారం ఆదివారంతో ఐదు వారాలు కంప్లీట్ చేసుకుని ఆరోవారంలోకి వెళ్ళబోతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ లో వారం వారం వింతలూ విశేషాలతో, కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్ అవుతూ హౌస్ మేట్స్ ని మందలిస్తూ.. వారం వారం అనుకోని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ.. వీక్ కంటెస్టెంట్స్ సేవ్ అవుతూ.. హాట్ స్టార్ లో బిగ్ బాస్ అలా అలా వెళుతుంది. ఇక వారం వారం నాగార్జున స్మూత్ గా హౌస్స్ మేట్స్ చేసే తప్పులకి వార్నింగ్ ఇస్తూ ఉండేవారు. కానీ ఈవారం నాగార్జున కి కోపం వచ్చింది. హౌస్ మేట్స్ లో కొంతమందిని నాగ్ చెడా మాడా తిట్టేసారు. హద్దులు మీరి మాట్లాడుతూ ఎక్కువ చేస్తున్న కంటెస్టెంట్లపై ఫైర్‌ అయ్యాడు.

ఇక యాంకర్ శివ కి నటరాజ్ మాస్టర్ కి మధ్యన జరిగిన గొడవ వలన నాగార్జున బాగా ఫైర్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ కి ఓ వీడియో చూపించడం, యాంకర్ శివ కి మరో వీడియో చూపించి వాయించేసాడు. శివ ఒక హౌస్‌మేట్‌ డ్రెస్సును బాత్రూమ్‌ బ్రష్‌తో ఉతికేసిన వీడియోను చూపించి శివ పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇది కరెక్టా, శివ చేసింది అంటూ బిందు మాధవిని నాగ్ అడగ్గా ఆమె తప్పని బదులిచ్చింది. శివ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా షటప్‌ అంటూ నాగరాజును శివ నోరు మూయించాడు. అలాగే శివకి బిగ్ పనిషమెంట్ ఇచ్చాడు నాగ్. ఈ వారం అంతా అమ్మాయిల బట్టలు ఉతకమని చెప్పాడు.

ఇక నటరాజ్ మాస్టర్ కి కూడా నాగార్జున బాగా గడ్డి పెట్టాడు. శివ లుంగీ ఎత్తి చూపిస్తాడు అని నటరాజ్ నాగ్ కి కంప్లైట్ చేసాడు. అందుకే నువ్వు బోసు డీకే అని తిడతావా అంటూ నాగార్జున ఓ వీడియో చూపించి నటరాజ్ ని తిట్టాడు. నటరాజ్ ఏదో చెప్పబోయే లోపు నన్ను మాట్లాడనివ్వు అంటూ గట్టగా నాగ్ అరవడంతో నటరాజ్ సైలెంట్ అయ్యారు. ఇక ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కా అని.. అది కూడా ముమైత్ ఖాన్, స్రవంతి అంటున్నారు.

Big Boss Non Stop: Nag fire on both contestants:

Bigg Boss Non Stop: Nagarjuna fires anchor Shiva and nataraj Master

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ