Advertisementt

ఆర్ ఆర్ ఆర్ 1000 కోట్ల అఫీషియల్ పోస్టర్

Sun 10th Apr 2022 05:36 PM
rrr,thousand crores club,bollywood,tollywood,rajamouli,nizam,ntr,ram charan  ఆర్ ఆర్ ఆర్ 1000 కోట్ల అఫీషియల్ పోస్టర్
RRR 1000 crore official poster ఆర్ ఆర్ ఆర్ 1000 కోట్ల అఫీషియల్ పోస్టర్
Advertisement
Ads by CJ

ఫైనల్లీ ఆర్ ఆర్ ఆర్ 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ట్రిపుల్ ఆర్ 15 రోజులకి ఆ మార్క్ వరల్డ్ వైడ్ గా సాధించి అటు ఎన్టీఆర్ ఫాన్స్ కి ఇటు చరణ్ ఫాన్స్ కి ఫుల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. మొదటి వీక్ లోనే ట్రిపుల్ ఆర్ సత్తాచాటగా సెకండ్ వీక్ లోను ఆర్ ఆర్ ఆర్ మూవీ తన మార్క్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అందులో రెండు వారాలుగా పాన్ ఇండియా మార్కెట్ ని గడగడలాడించే సినిమాలేవి లేకపోవడంతో ట్రిపుల్ ఆర్ హవా నడిచింది. ఇక కెజిఎఫ్ 2 వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ కి తిరుగులేదు. ఇప్పటికీ ఆ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు. 

ఇక ట్రిపుల్ ఆర్ నార్త్ అమెరికాలో ఇప్పటికే 13 మిలియన్ డాలర్స్‌‌పైగా వసూలు చేసి 100 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. హిందీ లో 200 కోట్ల మార్క్ ని అందుకోవడంతో ట్రిపుల్ ఆర్ మేకర్స్ హ్యాపీ గా పార్టీ ఇచ్చారు. ఇక్క నైజాం లో 100 కోట్లు దాటేసింది. ఆదితో దిల్ రాజు ఖుషి. రెండు వారలు దాటేసరికే ట్రిపుల్ ఆర్ రికార్డులతో రెచ్చిపోయింది. ట్రిపుల్ ఆర్ మూడో వారంలో కూడా సూపర్ స్ట్రాంగ్‌గా ఉంటూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ సినిమా 16వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 3.10 కోట్ల రేంజ్‌లో షేర్‌ని అందుకుంది. దానితో కలిపి 1000 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడంతో మేకర్స్ ఆ 1000 కోట్ల పోస్టర్ ని అఫీషియల్ గా రిలీజ్ చేసారు. 

దానితో 1000 కోట్ల క్లబ్బులోకి చేరిన మూడో చిత్రం ట్రిపుల్ ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. అది 1000 కోట్ల క్లబ్బులో మొదటగా దంగల్ ఉండగా.. రెండో మూవీ గా బాహుబలి ఉంది. ఇప్పుడు మూడో ప్లేస్ ని ట్రిపుల్ ఆర్ ఆక్రమించింది. 

RRR 1000 crore official poster:

RRR enters into the thousand crores club

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ