గత కొన్ని రోజులుగా ఈ ఆదివారం బిగ్ బాస్ నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న వారిలో అరియనా, అఖిల్ అజయ్ తప్ప మిగిలిన 11 మందిలో బిందు మాధవి ఓటింగ్ లో టాప్ లో ఉన్నట్లుగా సర్వే లు చెబుతున్నాయి. తర్వాత యాంకర్ శివ రెండో ప్లేస్ లో ఉన్నట్లుగా, ఆ తర్వాత ఆశు రెడ్డి, అజయ్, అనిల్ లు సేఫ్ జో లో ఉండగా.. ఆ తర్వాత మిత్ర శర్మ, మహేష్ ఉన్నారు. చివరిగా ముమైత్ అండ్ స్రవంతి లు డేంజర్ లో ఉన్నట్లుగా తెలిసింది. ఈ వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడిచింది.
కానీ తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ కి బిగ్ షాక్ తగలబోతోంది అని, ఈసారి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసారు అని అంటున్నారు. అందులో భాగంగా ముమైత్ ఖాన్, స్రవంతిలు ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది అని, డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ముమైత్, స్రవంతి లు హౌస్ ని వీడైనట్లుగా తెలుస్తుంది. దానితో హౌస్ మేట్స్ షాకవ్వడమే కాదు సర్ ప్రైజ్ అయ్యారట. ఇక స్రవంతి ఊహించిన ఎలిమినేషన్ తో బోరుమందట.