Advertisementt

యాంకర్ అనసూయ చేతిలో పాప ఎవరంటే

Sun 10th Apr 2022 11:24 AM
anasuya,anchor anasuya emotional moments,etv sri rama navami event,jabardasth anchor anasuya  యాంకర్ అనసూయ చేతిలో పాప ఎవరంటే
Jabardasth Anchor Anasuya Emotional On Baby Girl యాంకర్ అనసూయ చేతిలో పాప ఎవరంటే
Advertisement
Ads by CJ

యాంకర్ అనసూయ పెళ్ళికి ముందు పాపులర్ అయిన ఫిగర్ కాదు, పెళ్లి తర్వాత పాపులర్ అయిన ఫిగర్. పెళ్లి తర్వాత అందరూ ఫెడవుట్ లిస్ట్ లోకి వెళ్తారనే భయంతో పెళ్లి చేసుకోకుండా కెరీర్ ని కాపాడుకుంటే.. అనసూయ మాత్రం పెళ్లి తరవాత ఫోటో షూట్స్ తో హైలెట్ అయ్యి యాంకర్ గా క్రేజ్ తెచ్చుకుని జబర్దస్త్ కామెడీ షో తో విరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే అప్పటికే అనసూయ కి పెళ్ళై ఇద్దరు మగ బిడ్డలు ఉన్నారు. ఆ తర్వాత వెండితెర మీద సత్తా చాటుతూ ఈటివి, జెమిని, స్టార్ మా ఛానల్స్ లో స్పెషల్ ఈవెంట్ లో యాంకరింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది. అయితే తనకి మంచి భర్త ఇద్దరు మగ పిల్లలు ఉన్నా తనకి అమ్మాయంటే ఇష్టమంటూ, కానీ ఆ అవకాశం లేదని ఎమోషనల్ అవ్వగా.. నీకు అమ్మాయి వస్తుంది అంటూ ప్రదీప్ మాచిరాజు, రష్మీ తధాస్తు అంటూ దీవించారు. 

ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకి అనసూయ చేతిలో ఓ పాప ఉండడం, ఆ పాప ని చూస్తూ మురిసిపోయిన అనసూయని చూసిన వారు అనసూయ అమ్మాయిని దత్త తీసుకుందేమో అనుకుంటున్నారు. అలా అనసూయ చేతిలో పాపతో శ్రీరామనవమి ఈటివి స్పెషల్ ఈవెంట్ లో కనిపించడంతో అనసూయ ఆ పాపని పెంచుకుంటుందేమో అందుకే అంతగా ఎమోషనల్ అవుతుంది అనుకుంటున్నారు గత పదిహేను రోజుల నుండి. ఈటీవీలో నవమి స్పెషల్ ప్రోగ్రాం ఈరోజే ప్రసారమయ్యింది. ఆ ఈవెంట్ లో అనసూయ ఎత్తుకున్న బుల్లి పాప ఎవరో కాదు.. కమెడియన్ ప్రసాద్ కూతురు. కమెడియన్ ప్రసాద్ కి ఓ పాప, బాబు. బాబు పెద్దవాడు కాగా.. పాప నెలలు పాప. ఆ పాపని అనసూయ ఎత్తుకుని ముద్దు చేసింది. ప్రసాద్ - సునీత ల ముద్దుల కూతురికి ఇంకా పేరు పెట్టలేదట. అనసూయ ఎత్తుకున్న పాప పై ఈ రోజు ఈవెంట్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

Jabardasth Anchor Anasuya Emotional On Baby Girl:

Anasuya captures lovely, emotional moments during Sri Rama Navami Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ