పూజా హెగ్డే జిమ్ చేస్తూ మంచి ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేస్తూ గ్లామర్ షో చేస్తుంది. ఒకప్పుడు ట్రెడిషనల్‌గా ఉంటే రాని ఆఫర్స్.. ‘డీజే’ మూవీలో చేసిన గ్లామర్ షోకి పూజాని తన్నుకుంటూ టాప్ ఛైర్‌కి వెళ్లేలా చేసింది. గ్లామర్ పాత్రలతో వెనుదిరిగి చూసుకోకుండా దూసుకుపోతుంది. బాలీవుడ్, కోలీవుడ్ టాలీవుడ్ అంటూ పాన్ ఇండియాలోనూ జెండా పాతేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా కోలీవుడ్ ‘బీస్ట్’ మూవీతో తెలుగు, తమిళ, హిందీ ఆడియన్స్‌ని అలరించేందుకు రెడీ అయ్యింది పూజ.
అయితే గ్లామర్ షో విషయంలో బాగా సన్నబడిన పూజా హెగ్డే ఇప్పుడు ‘బీస్ట్’ సినిమాలో కాస్త బొద్దుగా, ముద్దుగా కనబడుతుంది. కాస్త ఒళ్ళు చేసినట్టుగా కనబడుతున్న ఆమెని ఇలా చూస్తే ముద్దొచ్చేస్తోంది. సినిమాలో కూడా పూజా గ్లామర్ గా విజయ్ సరసన అదిరిపోయే స్టెప్స్ వేసింది. బీస్ట్ సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక బీస్ట్ ప్రమోషన్స్ లోను పూజా హెగ్డే చాలా అందంగా కనబడుతుంది. కొద్దిగా ఒళ్ళు చేసిన కారణంగానే పూజ హెగ్డే ఫేస్‌లో గ్లో వచ్చింది.. అందుకే ఆ కళ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తుంటే.. నెల్సన్ కావాలనే పూజాని బొద్దుగా చూపించారని అనేవారు కూడా లేకపోలేదు.