Advertisementt

కోలీవుడ్ స్టార్స్‌కి అంత గర్వమా..

Sat 09th Jul 2022 10:53 AM
vijay,beast,telugu promotions,tollywood audience,beast promotions,pooja hegde,dil raju  కోలీవుడ్ స్టార్స్‌కి అంత గర్వమా..
No Vijay at Beast Telugu Promotions కోలీవుడ్ స్టార్స్‌కి అంత గర్వమా..
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ప్రతి భాషలోనూ ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆయా భాషల్లో ప్రెస్ మీట్స్ పెట్టి మరీ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గతంలో ప్రభాస్ బాహుబలి కోసం రాజమౌళితో కలిసి అన్ని భాషల్లో సినిమాని ప్రమోట్ చేశారు. అలాగే రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్ మూవీని రాజమౌళి చెన్నై, బెంగుళూరు, కొచ్చి, ముంబై, దుబాయ్ అంటూ ప్రతి భాషలో సినిమాని ప్రమోట్ చేశారు. అలా తమ తమ సినిమాలని ఇతర భాషల్లో భారీ రేట్లకి అమ్మడమే కాదు.. అక్కడ సినిమాలు కొన్నవారికి లాస్ రాకుండా సినిమాని ప్రమోట్ చేశారు.

 

కానీ కోలీవుడ్ హీరోలు మాత్రం అలా కాదు. కోలీవుడ్ స్టార్ హీరోల ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది. ఇక్కడ కోట్లకి కోట్లు పెట్టి ఆ సినిమా హక్కులు దక్కించుకుని రిలీజ్ చేస్తుంటారు. కానీ ప్రమోషన్స్ విషయానికి వచ్చేసరికి ఒక్క హీరో కూడా హైదరాబాద్‌కి వచ్చి ప్రమోట్ చేయరు. ఆ సినిమా దర్శకుడు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇక్కడ సినిమాని కొన్న నిర్మాతలు సినిమాలు ప్రమోట్ చేస్తారు తప్ప వారు మాత్రం దిగరు. రీసెంట్‌గా అజిత్ ‘వలిమై’ విషయంలో ఏదైతే జరిగిందో.. ఇప్పడు ‘బీస్ట్’ విషయంలోనూ అదే జరిగింది. ‘వలిమై’ని బోనీ కపూర్ వచ్చి ప్రమోట్ చేసుకుంటే.. ‘బీస్ట్’కి నెల్సన్‌తో పాటుగా హీరోయిన్ పూజ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వచ్చి దిల్ రాజు కోసం ప్రమోట్ చేశారు. కానీ విజయ్ మాత్రం రాలేదు. తమిళ్ తర్వాత తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోలు స్వయంగా సినిమాని ప్రమోట్ చేస్తే వారి మార్కెట్ మరికాస్త పెరుగుతుంది కానీ.. వాళ్ళు ఎందుకో అలా చెయ్యరు.

No Vijay at Beast Telugu Promotions:

Tollywood Audience Unhappy with Beast Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ