Advertisementt

బిగ్ బాస్ సిరికి బాయ్ ఫ్రెండ్ కి సెట్టయ్యింది

Fri 08th Apr 2022 08:50 PM
siri,instagram story,srihan,big boss,bigg boss  బిగ్ బాస్ సిరికి బాయ్ ఫ్రెండ్ కి సెట్టయ్యింది
Siri instagram story about the differences in her relationship బిగ్ బాస్ సిరికి బాయ్ ఫ్రెండ్ కి సెట్టయ్యింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో షణ్ముఖ్ - సిరి చేసిన ఫ్రెండ్ షిప్ అంతా వారి మధ్యన ఎఫ్ఫైర్ నడిచింది అన్న రేంజ్ లో ప్రొజెక్ట్ అయ్యింది. నిజమే ఆ హగ్గులు, ముద్దులు, అలకలు అన్ని సిరి - షణ్ముఖ్ మధ్య ప్రేమ మొదలైంది అనేలా ఉన్నాయి. ఇక హౌస్ నుండి రన్నర్ గా బయటికి వచ్చాక షణ్ముఖ్ కి ఆయన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన బ్రేకప్ చెప్పి షాకివ్వగా.. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా సిరికి దూరంగానే ఉంటూ వచ్చాడు. ఆల్మోస్ట్ వారి మధ్యలో కూడా బ్రేకప్ అయిందేమో అని అందరూ అనుకునేలా శ్రీహన్ వారి ఫొటోస్ ని సోషల్ మీడియా నుండి తొలగించాడు. గత రెండు నెలలుగా సిరి - శ్రీహన్ కలిసిన సందర్భం కూడా లేదు. దానితో వీరి మధ్యన గొడవలయ్యాయి కాబట్టే దూరంగా ఉంటున్నారని అనుకుంటున్నారు. 

అయితే తాజాగా సిరి తమ రిలేషన్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ శ్రీహన్ తో కలిసి ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ.. ప్రతి క్షణం నా పక్కనే నిలబడిన వ్యక్తి. మంచి మనసు ఉన్నవాడు. నా బలం, నా శక్తి, నా గార్డియన్, నా సర్వస్వము, వన్ అండ్ ఓన్లీ శ్రీహన్ అంటూ తన ఇన్స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది. శ్రీహన్ - సిరి జంటగా ఉన్న ఫొటోస్ చూసిన ఫాన్స్ మాత్రం చెప్పలేనంత సంతోషంగా ఉన్నారు. వారిద్దరూ మళ్ళీ ఒక్కటి కావాలని అందరూ కోరుకున్నారు. కోరుకున్నట్టుగానే  వారు కలిసారంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Siri instagram story about the differences in her relationship :

Siri instagram story about the differences in her Srihan relationship 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ