Advertisementt

పవన్ కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై క్లారిటీ

Fri 08th Apr 2022 08:08 PM
renu desai,akira nandan,akira silver screen entry,pawan kalyan son  పవన్ కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై క్లారిటీ
Renu Desai comments on Akira Silver Screen entry పవన్ కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై క్లారిటీ
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పటినుండో సినిమాల్లోకి రాబోతున్నాడని ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది. అకీరా బర్త్ డే అప్పుడు ఆ ప్రచారానికి మరింత ఊతమొస్తుంది. ఇక అకీరా తో అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ మ్యూజిక్ నేర్చుకోవడం చూసిన వారు పవన్ కొడుకు నటనలోనూ, ఇలా మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంటున్నాడు అకీరా సినిమా ఎంట్రీ పక్కా అంటూ మాట్లాడారు. కానీ నేడు అకీరా బర్త్ డే సందర్భంగా అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై అకీరా మదర్ పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

అకీరా నాకు మంచి కొడుకు మాత్రమే కాదు, ఆద్య కి బెస్ట్ అన్నయ్య కూడా. అలాగే అకీరా ఫ్రెండ్స్ కి అకీరా మంచి మిత్రుడు. మంచి మనసున్న జెంటిల్ మ్యాన్ అకీరా. ఈ రోజు 18 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న అకీరా కి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అకీరా కి బర్త్ డే విషెస్ అందిస్తున్న అందరికి పేరు పేరునా ధన్యవాదాలు అంటూ ఓ వీడియో షేర్ చెయ్యగా.. కొంతమంది నెటిజెన్స్ ఆ వీడియో చూసి అకీరా సినిమాల్లోకి వచ్చేస్తున్నాడనే కామెంట్స్ చెయ్యగా.. దానికి రేణు కాస్త అసహనంతో అకీరాకి యాక్టర్ అవ్వాలని లేదు అంటూ చెప్పి షాకివ్వడమే కాదు, ఇలాంటి వార్తలు పుట్టించొద్దు అని, అకిరా ఎలాంటి సినిమాలో నటించడం లేదు, అలాగే ఏ సినిమాకి సైన్ చెయ్యలేదు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చెయ్యొద్దు అంటూ కాస్త గట్టిగానే చెప్పింది.

Renu Desai comments on Akira Silver Screen entry:

Renu Desai clarity about Akira Silver Screen entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ