Advertisementt

ప్రభాస్ సినిమా రీమేక్ కాదు

Fri 08th Apr 2022 05:01 PM
prabhas,salaar,director prashanth neel,kannada ugram movie  ప్రభాస్ సినిమా రీమేక్ కాదు
Salaar not a remake, says director Prashanth Neel ప్రభాస్ సినిమా రీమేక్ కాదు
Advertisement
Ads by CJ

ప్రభాస్ కన్నడ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ పాన్ ఇండియా ఫిలిం చేస్తున్న విషయం తెలిసిందే. ఓ 30 శాతం షూటింగ్ పూర్తయ్యాక సలార్ షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. అటు ప్రభాస్ రాధే శ్యామ్ ప్రమోషన్స్ తో, ఇతర సినిమాలతో బిజీ అవ్వగా.. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 షూట్, ప్రమోషన్స్ తో బిజీ అయ్యారు. అయితే ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అయిన కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ లో ప్రశాంత్ నీల్ కి అడుగడుగునా ప్రభాస్ సలార్ ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇక అక్కడక్కడా ఆయన సలార్ పై కూడా అప్ డేట్ ఇస్తున్నారు.

తాజాగా సలార్ మూవీ మీరు డైరెక్ట్ చేసిన ఉగ్రం సినిమాకి రీమేక్ అంట కదా అని ఓ జర్నలిస్టు ప్రశాంత్ నీల్ ని ప్రశ్నించారు. సలార్ మూవీ అనౌన్స్ చేసినప్పటినుండే ఆ సినిమా ప్రశాంత్ నీల్ గతంలో కన్నడలో తెరకెక్కించిన  ఉగ్రం కి రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. అదే ప్రశ్న ప్రశాంత్ నీల్ కి ఇప్పుడు ఎదురైంది. దానికి ఆయన సలార్ సినిమా ఉగ్రం సినిమాకి రీమేక్ కాదని, ఇది డైరెక్ట్ మూవీ అని, ఉగ్రం కి సలార్ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. 

Salaar not a remake, says director Prashanth Neel:

Prabhas starrer Salaar not a remake, says director Prashanth Neel

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ