అల్లు అర్జున్ పుష్ప రాజ్ తో ఓ ట్రెండ్ సెట్ చేసారు. పుష్ప ద రైజ్ అంటూ అల్లు అర్జున్ మాస్ స్టయిల్ కి ఫాన్స్ జై జై లు పలికారు. లాంగ్ హెయిర్, పాతకాలంనాటి స్టయిల్, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే నెగెటివ్ కేరెక్టర్ లో పుష్ప గా అల్లు అర్జున్ తగ్గేదేలే అని చెప్పిన డైలాగ్ స్టిల్ ఇప్పటికి ట్రెండ్ అవుతుంది అంటే అల్లు అర్జున్ ఎంతగా ఆ డైలాగ్ ని ఆడియన్స్ లోకి తీసుకు వెళ్లారో అర్ధమవుతుంది. పుష్ప లో చెయ్యి ఎత్తి, విలన్స్ ని చితకబాదుతూ, కూలీ స్థాయి నుండి.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎర్ర చందనం సిండికేట్ నే శాసించే స్థాయికి పుష్ప రాజ్ గా ప్రయాణం సాగించారు. పోలీస్ ఆఫీస్ భన్వర్ లాల్ తో విరోధం పెట్టుకోవడంతో ముగిసిన పార్ట్ వన్ కి కంటిన్యూషన్ గా పుష్ప ద రూల్ మొదలు కాబోతుంది. జులై నుండి షూటింగ్ మొదలు కానున్న పుష్ప ద రూల్ నుండి అల్లు అర్జున్ పుష్ప పోస్టర్ రివీల్ చేసింది టీం.
ఎందుకంటే ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే. ఇంకా షూటింగ్ మొదలు పెట్టకపోయినా పుష్ప వన్ అప్పుడు షూట్ చేసిన పిక్స్ ని పోస్టర్ గా చేసి ఆ లుక్ ని వదిలారు. పుష్ప రాజ్ పార్ట్ వన్ లో కనిపించినంత మాస్ గా కాకుండా కొద్దిగా క్లాస్ గా కనిపిస్తున్నారు అల్లు అర్జున్ ఈ లుక్ లో. కళ్ళద్దాలతో, టక్ చేసి చెయ్యి పైకెత్తి న అల్లు అర్జున్ పుష్ప లుక్ లో పుష్ప పార్ట్ వన్ కి ఇప్పటికీ లుక్ లో చాలా వేరియేషన్స్ చూపించారు. ఈసారి కొత్త గా నే ట్రై చేసారు. మరి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ కి సినీజోష్ టీం తరపుమన ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.