అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో లవర్ బాయ్ గా హిట్ అందుకున్నాడు. పూజ హెగ్డే తో కలిసి అఖిల్ డీసెంట్ హిట్ అందుకున్నాక ఇప్పుడు మాస్ అవతార్ లో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఏజెంట్ మూవీ మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అఖిల్ రా ఏజెంట్ గా ఈ స్పై థ్రిల్లర్ ఏజెంట్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ తో మాస్ లుక్ లో అద్భుతమైన మేకోవర్ అయ్యాడు. అలాగే హెయిర్ పెంచి రఫ్ గా కనిపించాడు.
నేడు అఖిల్ బర్త్ డే. అందుకే ఏజెంట్ మేకర్స్ స్పెషల్ గా అఖిల్ కి ఏజెంట్ కొత్త పోస్టర్ ని రివీల్ చేసి ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు లవర్ బాయ్ లా సాదా సీదా గా కాస్త స్టైలిష్ లుక్ లో కనిపించిన అఖిల్.. ఏజెంట్ గా మాత్రం నోట్లో సిగరెట్ తోనూ, తలకి హెయిర్ బ్యాండ్ పెట్టుకుని మాస్ కాదు కాదు ఊర మాస్ గా సిక్స్ ప్యాక్ బాడీతో మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఏజెంట్ మూవీలో మలయాళ నటుడు మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ముంబై మోడల్ సాక్షి వైదే హీరోయిన్ గా అఖిల్ తో రొమాన్స్ చేయబోతుంది.