పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి వరసగా సర్ ప్రైజ్ లే సర్ ప్రైజ్ లు. భీమ్లా నాయక్ మూవీ తో సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఫాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలపై అటు ఆడియన్స్ లోను ఇటు ఫాన్స్ లోను విపరీతమైన అంచనాలున్నాయి. ఇప్పటివరకు రీమేక్ చేసిన పవన్ ఇప్పుడు స్ట్రీట్ మూవీస్ చేస్తున్నారు. అది క్రిష్ తో హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్. ఇప్పుడు ఈ రెండు సినిమాల అప్ డేట్ తో ఫాన్స్ కి సర్ ప్రైజ్ లు ఇచ్చి ఉక్కిరిబిక్కిరి చేసారు. ఉదయం హరి హర వీరమల్లు షూటింగ్ రేపటి నుండి అంటూ అప్ డేట్ ఇచ్చారు.
ఇక రాత్రి పది గంటల ప్రాంతంలో హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చెయ్యబోయే భవదీయుడు భగత్ సింగ్ మూవీ అప్ డేట్ ఇచ్చారు. అది కూడా హరీష్ శంకర్ తో డిస్కర్స్ చేస్తున్న పిక్స్ తో. అలాగే మేకర్స్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఫొటోస్ ని షేర్ చేసారు. భవదీయుడు భగత్ సింగ్ మూవీ Kickstarting the MASSive Shoot very soon 💥💥 Eesari Box Office Baddal Baashingale 🔥 మాసివ్ షూట్ త్వరలోనే అని, అలాగే ఈసారి బాక్సాఫీస్ బద్దలు అంటూ మాసివ్ అప్ డేట్ ఇవ్వడంతో పవన్ ఫాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.