ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ప్రతి భాషలోనూ ప్రభంజనం సృష్టిస్తున్న పాన్ ఇండియా ఫిలిం. రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీకి అందరూ బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ టీం ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాత దానయ్య అయితే సూపర్ హ్యాపీ. అంతేకాదు.. ట్రిపుల్ ఆర్ ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ పండగ చేసుకుంటున్నారు. బయ్యర్స్ ట్రిపుల్ ఆర్ హిట్ తో హ్యాపీ గా ఉన్నారు. ఇంకా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆ ఆనందంతో పెద్ద పార్టీనే ఇచ్చారు. నైజాం లో 100 కోట్ల మార్క్ అందుకున్న ట్రిపుల్ ఆర్ తో హ్యాపీ గా ఉన్నారు దిల్ రాజు. ఇక అటు హిందీలో ట్రిపుల్ ఆర్ 200 కోట్ల మార్క్ అందుకుంది అంటూ పోస్టర్ రిలీజ్ చేసారు అక్కడి మేకర్స్.
పెన్ మూవీస్ వారు హిందీలో ట్రిపుల్ ఆర్ ని రిలీజ్ చేసారు. వారు కూడా ట్రిపుల్ ఆర్ హిందీలో సూపర్ హిట్ అవడంతో ఆ జోష్ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ దగ్గర నుండి.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి స్పెషల్ గా ముంబైలో పార్టీ ఆరెంజ్ చేసారు. అయితే నేడు ట్రిపుల్ ఆర్ మూవీ హిందీలో 200 కోట్ల మార్క్ ని అందుకున్నట్టుగా పోస్టర్ ని రిలీజ్ చేసారు. అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ కొమరం భీమ్, రామరాజు గా మీసాలు మేలుస్తూ ఉన్న పోస్టర్. ఆ పోస్టర్ చూస్తే ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ కి ఆకలి కూడా వెయ్యదు. కడుపు నిండిపోవడం ఖాయం. నిజంగానే 200 కోట్ల అఫీషియల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.